రాజకీయాల కోసమే విశాఖలో వైఎస్ జగన్ పర్యటన: పల్లా శ్రీనివాస రావు

Date:

విశాఖపట్నం, జులై 14: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. విశాఖ పర్యటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు స్పందించారు. ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ. ఇప్పటికైనా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు శవ రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు.

నేడు జగన్ రెడ్డి. విశాఖపట్నానికి ఎందుకు వస్తున్నారో ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఒక్క మత్స్యకారుడికి కూడా న్యాయం చేయలేదని విమర్శించారు. వారికి చట్ట ప్రకారం చెల్లించాల్సిన బకాయిలను చెల్లించలేదన్నారు.

అసలు మత్స్యకారులకు జగన్‌ రెడ్డి ఏం చేశారో సమాధానం చెప్పాలని పల్లా అన్నారు. మత్స్యకార నిధులను కూడా జగన్ డైవర్ట్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడి ప్రమాద ఘటన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ మత్స్యకారులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ రాజకీయాలు చేయడం కోసమే విశాఖకు వస్తున్నారని పల్లా శ్రీనివాస రావు వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....