జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి బలంగా ఉందని దానిని విచ్ఛిన్నం చేసేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలను ఐక్యంగా తిప్పికొడతామని ఏపీ గ్రీన్ ఆంధ్ర చైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన శుక్రవారం ప్రత్తిపాడులో మీడియాతో మాట్లాడారు.

టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య ఐక్యత చెక్కుచెదరదని మూడు పార్టీలది ఒకే మాట ఒకే బాట అని నాగబాబు పేర్కొన్నారు. సీట్ల సర్దుబాటు సమయంలో చిన్నపాటి మనస్పర్థలు రావడం సహజమేనని ఎన్నికల తర్వాత ఎలాంటి విభేదాలు ఉండవని తెలిపారు.

రాష్ట్ర అభివృద్ధే ప్రధాన అజెండాగా కూటమి నేతలంతా కలిసి పనిచేస్తారని చెప్పారు. వైసీపీ పాలన మళ్లీ రాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాగబాబు పేర్కొన్నారు. కూటమిని బలహీనపరిచేందుకు ప్రతిపక్షాలు చేసే కుట్రలను సమష్టిగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *