
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జూలై 16న గురువారం రోజున సూర్య, చంద్రులు కలిసి పరివర్తన యోగాన్ని ఏర్పరచనున్నారు. ఈ శుభ యోగం కారణంగా మేషం సహా కొన్ని రాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జూలై మాసంలో ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ముఖ్యంగా మూడో వారంలో అంటే జూలై 16వ తేదీన గ్రహాలకు రాజుగా పరిగణించే ఏర్పడనుంది. సూర్యుడు, మిథున రాశి నుంచి నిష్క్రమించి కర్కాటక రాశిలో ప్రవేశించనున్నాడు. ఇదే సమయంలో చంద్రుడు అధిపతిగా కర్కాటక రాశిలో చంద్రుడితో కలయిక జరపనున్నాడు. ఈ కారణంగా పరివర్తన యోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం కారణంగా కర్కాటకం సహా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఏ రాశుల వారికి సూర్య, చంద్రుల కలయికతో ఏ రాశుల వారికి అదృష్టం కలిసి రానుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సమయంలో మీకు సానుకూల ఫలితాలొచ్చే అవకాశాలున్నాయి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు అపారమైన విజయాలు సాధించే అవకాశం ఉంది. సూర్య, చంద్రుల అనుగ్రహంతో మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది.
ఈ కాలంలో కొత్త వాహనం కొనేందుకు ప్లాన్ చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు ప్లాన్ వేస్తారు. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఊహించని లాభాలు రావొచ్చు.

