D Spiritaul: Nov 21: మైలవరం అయ్యప్ప ఆలయాన్ని సందర్శించిన కేరళ గురుస్వాములు

ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని అయ్యప్ప స్వామి ఆలయాన్ని కేరళకు చెందిన గురుస్వాములు సందర్శించారు. ఈ సందర్భంగా కేరళ సంప్రదాయ వాయిద్యాల నడుమ ఆలయ కమిటీ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు.

అనంతరం విఘ్నేశ్వరుని ఆలయంలో పూజారులు గురుస్వాములకు వేద ఆశీర్వచనాలు అందించారు. ఈ నెల 28వ తేదీన నిర్వహించనున్న పడిపూజ విశేషాలు, ఏర్పాట్ల గురించి ఆలయ కమిటీ సభ్యులు గురుస్వాములకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *