
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో కావ్య మారన్ వివాహ రిసెప్షన్ వేడుక చెన్నైలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేశ్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రిసెప్షన్‌కు విచ్చేసిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, సినీనటుడు రజనీకాంత్, మాజీ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌లను లోకేశ్ మర్యాదపూర్వకంగా కలిశారు. రజనీకాంత్ లోకేశ్‌తో ఆప్యాయంగా మాట్లాడారు.
అలాగే రాజ్యసభ సభ్యుడు, డీఎండీకే నేత ఎల్‌కే సుధీశ్, ఎల్‌కేఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండీ పూర్ణ జ్యోతి దంపతుల కుమార్తె వివాహ రిసెప్షన్‌కు కూడా లోకేశ్ హాజరయ్యారు. ఈ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
