ఆంధ్రప్రదేశ్‌లో పుట్టిన స్వదేశీ బ్రాండ్‌ అంతర్జాతీయ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమైందని మంత్రి నారా లోకేశ్‌ పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్స్‌ సంస్థ ఆసియాలోనే అతిపెద్ద శీతలపానీయాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు.

గతేడాది నవంబరులో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఈ పరిశ్రమకు శంకుస్థాపన జరిగిందని కేవలం 12 నెలల్లోనే ఉత్పత్తి ప్రారంభం కావడం విశేషమని లోకేశ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న ‘స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’కు ఈ ప్లాంటు ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.

ఈ భారీ పరిశ్రమ ద్వారా స్థానికంగా 1,200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక ప్రగతికి స్వదేశీ బ్రాండ్ల అంతర్జాతీయ విస్తరణకు ఈ ప్లాంటు ఒక కీలక ముందడుగు అని పేర్కొంటూ దీని విజయగాథను అందరూ తెలుసుకోవాలని లోకేశ్‌ పిలుపునిచ్చారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *