
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబరు 2, 3 తేదీల్లో విజయనగరంలోని రాజీవ్ క్రీడా మైదానంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పారా స్పోర్ట్స్ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రామసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
పోటీల నిర్వహణపై శనివారం సంబంధిత శాఖల అధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పోటీల్లో పాల్గొనే క్రీడాకారుల వివరాలు వారి సంఖ్య, ప్రత్యేక ఎస్కార్ట్ సహాయం అవసరమైనవారిని ముందుగానే గుర్తించి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
క్రీడాకారులు తమ ప్రాంతాల నుంచి బయలుదేరినప్పటి నుంచి పోటీలు ముగించుకుని తిరిగి వెళ్లే వరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. దివ్యాంగ క్రీడాకారులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
క్రీడాకారులకు కేటాయించే కల్యాణ మండపాలు ఇతర వసతి కేంద్రాల్లో తప్పనిసరిగా మరుగుదొడ్ల సదుపాయాలు ఉండేలా చూడాలన్నారు. ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో పారా అథ్లెటిక్స్, పారా బ్యాడ్మింటన్, పారా టేబుల్ టెన్నిస్ (సింగిల్స్), పారా తైక్వాండో, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ గోల్‌బాల్ తదితర ఆరు క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నారు. సుమారు 200 మంది దివ్యాంగ క్రీడాకారులతో
