UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

Date:

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ ఛార్జీలు విధించేందుకు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఉచితంగా లావాదేవీలు చేసుకునే అవకాశం ఉంది. కానీ త్వరలో మర్చంట్ ఫీజును వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది.

కేంద్రం నుంచి త్వరలో ఆమోదం

ప్రస్తుతం కేంద్రం వద్ద దీనికి సంబంధించిన ముసాయిదా ప్రతిపాదన పెండింగ్‌లో ఉంది. కేంద్రం నుంచి అనుమతి రాగానే కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయి. దీనిపై కేంద్రం చర్చలు జరుపుతుండగా.. త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే పెద్ద వ్యాపారులు, ఈకామర్స్ దిగ్గజాలు మాత్రమే ఈ ఛార్జీల పరిధిలోకి రానున్నాయి. ఈ రుసుంల వల్ల యూపీఐ పేమెంట్ యాప్స్, బ్యాంకులకు అదనపు ఆదాయం దక్కనుంది. జనవరి 2020 నుంచి ఉచితంగా సేవలు అందిస్తుండగా.. ఇప్పుడు ఛార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఎండీఆర్ ఛార్జీల విషయానికొస్తే.. రూ.40 లక్షలపైన వార్షిక టర్నోవల్ ఉన్న మర్చంట్లపై 5 నుంచి 7 బేసిస్ పాయింట్ల వరకు ఛార్జీలు వసూలు చేయాలని భావిస్తున్నారు. రూ.10 వేలపైన ట్రాన్సాక్షన్ చేస్తే రూ.5 నుంచి రూ.7 వరకు మర్చంట్ ఫీజు ఉంటుంది.

వారి నుంచి మాత్రమే వసూలు

అయితే వార్షిక టర్నోవర్ రూ.40 లక్షల కంటే తక్కువ ఉన్న వ్యాపారులకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఇక సాధారణ వినియోగదారులకు కూడా ఉచితంగా లావాదేవీలు చేయవచ్చు. కేవలం పెద్ద వ్యాపారుల నుంచే మాత్రమే వసూలు చేస్తారు. యూపీఐ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ నిధులు యాప్స్ నిర్వాహకులకు ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. జీరో ఎండీఆర్ ఛార్జీల వల్ల పేటీఎం, ఫోన్ ఫే, గూగుల్ పే లాంటి యాప్స్‌కు ఎలాంటి అదనపు ఆదాయం లభించడం లేదు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ సొమ్ము కూడా యూపీఐ నిర్వహణకు సరిపోవడం లేదు. దీంతో యూపీఐ యాప్స్ స్థిర ఆదాయం కోసం ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో ప్రభుత్వం పెద్ద వ్యాపారుల నుంచి మర్చంట్ ఛార్జీలు వసూలు చేసేందుకు ముందడుగు వేసింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

గుడిపాల నుంచి తమిళనాడుకు జోరుగా ఇసుక అక్రమ రవాణా?

చిత్తూరు: తమిళనాడు సరిహద్దుకు ఆనుకుని ఉన్న గుడిపాల మండలంలో ఇసుక అక్రమ రవాణా...

కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి..

శావల్యాపురం: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం...

రాత్రి హామీ.. ఉదయానికే పరిహారం చెక్కు అందజేత..

కళ్యాణదుర్గం: శెట్టూరు మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో 8వ తరగతి...

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. ఇక కరెంట్ కష్టాలు తీరినట్లే..!

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్! ఈ సీజన్‌లో తొలిసారిగా శ్రీశైలం జలాశయంలో జలవిద్యుత్...