కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేద ప్రజల కోసం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ఎప్పటినుంచో అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా రూ.5 లక్షల వరకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్‌మెంట్ పొందవచ్చు. అయితే తాజాగా కేంద్రం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక నుంచి ఫోన్ ద్వారానే ఓపీడీ బుక్ చేసుకోవచ్చు.

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా కోట్లాదిమంది దేశవ్యాప్తంగా లబ్ది పొందుతున్నారు. ఈ ఒక్క కార్డు ఉంటే చాలు.. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఉచిత క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. పేద ప్రజలకు వైద్యం భారం కాకూడదనే ఉద్దేశంతో గతంలో ఈ పథకం తీసుకొచ్చింది. అత్యవసర పరిస్థితుల్లో డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా పేదలు వైద్యం చేయించుకోవచ్చు. అయితే ఆయష్మాన్ భారత్ లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అంచింది. తాజాగా జాతీయ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. ఇక నుంచి ఇంటి నుంచే ఓపీడీ అపాయింట్‌మెంట్ బుకింగ్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఇక నుంచి ఆస్పత్రులకు వెళ్లకుండానే రోగులు ఇంటి నుంచే మొబైల్ ద్వారా ఓపీడీ బుక్ చేసుకోవచ్చు.

ఓపీడీ మొబైల్ ద్వారా బుక్ చేసుకోవడం ఎలా..

ఆయుష్మాన్ భారత్ లబ్దిదారులు 18001800444 నెంబర్‌కు కాల్ చేయడం ద్వారా ఇంటి నుంచే ఓపీడీ బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల అత్యవసర వైద్య పరిస్థితుల్లో ఓపీడీ కోసం ఆస్పత్రుల్లో వెయిటింగ్ చేయాల్సిన పని ఉండదు. అలాగే క్యూలో నిల్చోవాల్సిన పని తప్పుతుంది. దీని వల్ల వెంటనే రోగి చికత్స పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. వైద్య సేవలను మరింత వేగవంతం చేసేందుకు జాతీయ ఆరోగ్య సంస్థ ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ నెంబర్‌కు కాల్ చేయగానే సమీప ఆస్పత్రికి ఫోన్ కాల్ చేయబడతుంది. దీంతో మీరు నిర్దిష్ట సమయం, స్పెషాలిటీని ఎంచుకుని అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. దీని వల్ల చికిత్స పొందేందకు ఎలాంటి ఆలస్యం జరగదు.

ఇంటి నుంచే అర్హతను చెక్ చేసుకోడమెలా..

మీరు ఇంటి నుంచే ఆయుష్మాన్ భారత్ పథకానికి అర్హులా.. కాదా అనేది తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఆయుష్మాన్ భారత్ యాప్ లేదా వెబ్‌సైట్ తెరవాల్సి ఉంటుంది. లబ్దిదారుల ఆప్షన్ ఎంచుకుని మీ ఆధార్, మొబైల్ నెంబర్ నమోదు చేయాలి. beneficiary.nha.gov.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. దీంతో మీరు అర్హులా. .కాదా అనేది స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్ 23న ప్రధాని మోదీ ప్రారంభించారు. సామాన్యులు రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ఔట్ పేషెంట్ అపాయింట్‌మెంట్లు, ఆస్పత్రి ఖర్చులు, వసతి, మందులతో సహా ఇతర వైద్య ఖర్చులను ఇది కవర్ చేస్తుంది.  70 ఏళ్లుపైబడినవారి కోసం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి వయ యోజన స్కీమ్ తీసుకొచ్చారు. వీళ్లు ప్రత్యేకంగా రూ.5 లక్షల వరకు క్యాష్‌లెస్ ట్రీట్‌మెంట్ పొందవచ్చు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *