
నగర మేయర్ ముక్కా శ్రావణి ఆమె కుటుంబ సభ్యులను రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోమవారం పరామర్శించారు. శ్రావణి తండ్రి మాజీ కార్పొరేటర్ ముక్కా ముత్యాలనాయుడు శుక్రవారం మృతి చెందడంతో ఆయన కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఈ క్రమంలో సోమవారం శాంతిపురంలోని ముత్యాలనాయుడు నివాసానికి వెళ్లిన మంత్రి లోకేశ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా ముత్యాలనాయుడు గతంలో కార్పొరేటర్‌గా జిల్లా బీసీ విభాగం ఉపాధ్యక్షుడిగా ప్రజలకు పార్టీకి అందించిన సేవలను మంత్రి గుర్తుచేసుకున్నారు.
ఈ పరామర్శ కార్యక్రమంలో ఎంపీ ఎం. శ్రీభరత్, ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పట్టాభి ప్రధాన కార్యదర్శి లోడగల కృష్ణ పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గండి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు.




