నర్సాపురం, నర్సాపురం మండలంలోని 28 గ్రామాల్లో గురువారం జరగనున్న పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.

మండలవ్యాప్తంగా మొత్తం 272 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల భద్రత, విధుల నిర్వహణ కోసం 76 మంది పోలీసులతో పాటు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. మరోవైపు మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామగ్రి పంపిణీ చేపట్టారు.

ఈ సందర్భంగా సీఐ ఆకుల రఘు పోలీసులకు పలు సూచనలు చేశారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి గుంపులు గుమిగూడకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *