యుద్ధంతో నష్టం చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.

Date:

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు. గత నెల రోజులుగా దేశంలో అనేక పరిణామాలు జరిగాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. మన యువత అంతరిక్షంలోకి దూసుకుపోయిందని. స్కైరూట్‌ సక్సెస్‌ కావడం దేశానికి గర్వకారణం అని మోదీ పేర్కొన్నారు. 28 ఏళ్ల యువకులు ఈ ఘనతను సాధించారన్నారు. యువత సాహసాలు చేయడమే కాదు, సక్సెస్‌ అవుతున్నారని మోదీ తెలిపారు.

రాజస్థాన్‌లో ఆయిల్‌ రిఫైనరీని దేశానికి అంకితంచేశామని సెమీ కండక్టర్‌ ప్లాంట్‌ను ప్రారంభించుకున్నామని గ్రీన్‌ హైడ్రోజన్‌ రైలు ప్రారంభించామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వర్షాకాలం వర్షాకాల సమావేశాలు అయినా – రెండూ కార్యసాధకంగా ఉంటే, అవి అత్యంత ఫలవంతంగా ఉంటాయని మోదీ పేర్కొన్నారు. రెండూ ఫలవంతంగా ఉన్నప్పుడు, అది దేశ సంక్షేమానికి, సకల జీవుల శ్రేయస్సుకు దారితీస్తుంది.

అందుకే వర్షాకాలం కార్యసాధకంగా, ఫలవంతంగా ఉండాలని, వర్షాకాల సమావేశాలు కూడా ఫలవంతంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము అని మోదీ పేర్కొన్నారు. యుద్ధం వల్ల చాలా దేశాలకు నష్టం జరుగుతోందని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయని వివరించారు. మన దేశం 7.7 శాతం గ్రోత్‌రేట్‌ నమోదు చేస్తోందన్నారు. ఈ వర్షాకాల సమావేశాలు సజావుగా జరగాలని కోరుతున్నా.

అందరం కలిసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి. అని మోదీ పేర్కొన్నారు. నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమై. ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ సభ ముందుకు పలు కీలక బిల్లులు రానున్నాయి.వందేమాతరం గేయాన్ని అవమానించడాన్ని నేరంగా పరిగణించి మూడేళ్ల వరకు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ జారీచేసిన ఆర్డినెన్సు స్థానంలో బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....