సీఎం విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు.

Date:

ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) ఎమ్మెల్యే మార్కండేయన్‌ను తూత్తుకుడి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్‌పై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ తమిళగ వెట్రి కళగం (టీవీకే) నేతల ఫిర్యాదు మేరకు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు (సోమవారం) తూత్తుకుడి జిల్లా విలాతికుళంలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని ఆయనను అరెస్టు చేశారు.

ఎమ్మెల్యే అరెస్టు సందర్భంగా పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి జయంతిని పురస్కరించుకుని ఇటీవల తూత్తుకుడి జిల్లా విలాతికుళం నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో ప్రసంగించిన ఎమ్మెల్యే మార్కండేయన్ సీఎం విజయ్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఆయన వ్యాఖ్యలపై టీవీకే పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ అభిమాన నేతను అవమానించారంటూ మండిపడ్డారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరగా, ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. కాగా, డీఎంకే ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను అరెస్టయిన కొన్ని రోజులకే మరో ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేయడంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

తూత్తుకుడి జిల్లా తిరుచెందూర్ ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్‌ను జులై 3న పోలీసులు అరెస్టు చేశారు. జూన్ 20న ముఖ్యమంత్రి విజయ్‌పై ఎమ్మెల్యే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని, సీఎం పరువుకు భంగం కలిగేలా మాట్లాడారని టీవీకే నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మెల్యేపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 352, 353(2) కింద కేసు నమోదు అయ్యింది. అయితే, అరెస్టు నుంచి రక్షణ కోరుతూ మద్రాస్ హైకోర్టును అనితా రాధాకృష్ణన్ ఆశ్రయించారు. విచారణ అనంతరం ఎమ్మెల్యే ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. దీంతో జులై 3న తూత్తుకుడి జిల్లా ఆథూర్ వద్ద ఎమ్మెల్యేను పోలీసులు అరెస్టు చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

అమరావతిలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన APCRDA కమిషనర్

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు! 🇮🇳 మన...

80వ స్వాతంత్ర్య వేడుకల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్డి

https://www.youtube.com/watch?v=1FCUo6Z5Pks 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి...

విజయవాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో 80వ స్వాతంత్ర్య...

స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు.. చిలకలూరిపేటలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు

ఈరోజు స్వత్రంత దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట మున్సిపల్ కార్యాలయం నందు జెండా...