Constable Suicide: డీజీపీ కార్యాలయంలో తుపాకితో కాల్చుకుని కానిస్టేబుల్ ఆత్మహత్య.!

Date:

హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో గురువారం ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఉదయం సుమారు 5:30 గంటల సమయంలో వాష్‌రూమ్‌కు వెళ్లిన స్వామి తన సర్వీస్ ఆయుధంతో కాల్చుకున్నట్లు తెలుస్తోంది. కాల్పుల శబ్దం విన్న సహచర సిబ్బంది అక్కడికి చేరుకునే సరికి ఆయన మృతిచెందినట్లు గుర్తించారు.

ఘటన స్థలంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఒక సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తన భార్య, పిల్లలను ఎవరూ తప్పుబట్టవద్దని, వారు ఎంతో మంచివారని పేర్కొన్నట్లు సమాచారం. అలాగే, వారిని ఎప్పటికీ కాపాడుతానంటూ భావోద్వేగంగా రాసినట్లు తెలిసింది.

సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఆత్మహత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత, కుటుంబ లేదా ఉద్యోగ సంబంధిత ఒత్తిళ్లు ఏవైనా ఉన్నాయా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: అయ్యో ఏమైంది తల్లి.. వారం క్రితమే బెంగళూరు నుంచి వచ్చింది.. ఇంతలోనే..

బెంగళూరులో పీజీ మెడిసిన్ చదువుతున్న 26 ఏళ్ల దీక్షిత హైదరాబాద్‌లోని నాగారం...

హైదరాబాద్ వాహనదారులకు గుడ్‌న్యూస్.. రూ.345 కోట్లతో కొత్త ఫ్లైఓవర్, ఈ ఏరియాలో ట్రాఫిక్ కష్టాలకు చెక్

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి జీహెచ్‌ఎంసీ...

ప్రతి నీటి బొట్టునూ స‌ద్వినియోగం చేసుకోవాలి.. అధికారులకు మంత్రి నిమ్మల సూచన

అమరావతి, జులై 25: రైతుల‌ ప్రయోజనాలను ర‌క్షించేందుకు ఇరిగేష‌న్, రెవెన్యూ అధికారులు...

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు టైఫాయిడ్..

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు....