రేపు పత్తికొండకు నారా లోకేశ్‌ రాక

Date:

విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ గురువారం పత్తికొండకు వస్తున్నారని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలిపారు. మంగళవారం ఆయన పత్తికొండ మండలంలోని హోసూరు సమీపంలో నారా లోకేశ్‌ పర్యటన కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ఆయన మాట్లాడుతూ సుమారు 2వేల ఎకారాల్లో ఏర్పాటుచేయనున్న టాటా, సుజ్‌లాన్‌ కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేయనున్న సోలార్‌ ప్రాజెక్టు భూమిపూజలో ఆయన పాల్గొంటారన్నారు. హోసూరు సమీపంలో భారీజనంతో నారా లోకేశ్‌కు ఘన స్వాగతం పలుకుతామన్నారు.

భూమి పూజ అనంతరం ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులతో మంత్రి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంద న్నారు. నియోజవర్గ అబ్జర్వర్‌ వడ్డే పోలన్న, గ్రంఽథాలయ సంస్థ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, మార్కెట్‌యార్డు చైర్మన్‌ ఆలంకొండ నబీసాహెబ్‌, టీడీపీ నాయకులు మనోహర్‌చౌదరి, వెల్దుర్తి సుబ్బరాయుడు, జ్ఞానేశ్వర్‌ గౌడ్‌ స్థానిక నాయకులు అంజి, రాఘవేంద్ర, రాహుల్‌, సాయి ఉన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Women and Thyroid: మహిళల్లో థైరాయిడ్ సమస్యలు ఎందుకు ఎక్కువగా వస్తాయి? వైద్యులు చెబుతున్న కారణాలివే!

థైరాయిడ్ గ్రంథి శరీరానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ జీవక్రియ, శక్తి...

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...