సామాన్యులకు బిగ్‌ అలర్ట్.. ఆగస్టు 1 నుంచి అమల్లోకి కొత్త రూల్స్.. తెలుసుకోకపోతే జేబుకు చిల్లే!

Date:

సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీ రాగానే మన ఆర్థిక పరిస్థితులు, అవసరాలను బట్టి ఎలాగైతే ఇంట్లో రూల్స్ మార్చుకుంటామో వ్యాపార సంస్థలు సైతం నెల ప్రారంభంలోని కొత్త విధానాలను అమల్లోకి తెలుస్తుంటారు. నేటితో జులై నెల ముగియడంతో ఆగస్టు 1, 2026 నుంచి మన ఆర్థిక పరిస్థితులను ప్రభావితం చాలా అంశాల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం

LPG సిలిండర్ ధరల సవరణ: అంతర్జాతీయ ప్రమాణాలు, డాలర్ విలువను బట్టి ప్రతి నెల 1వ తేదీ లాగే, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆగస్టు 1న గృహ, వాణిజ్య LPG సిలిండర్ల ధరలను సమీక్షించి నూతన రేట్లను ప్రకటిస్తాయి. ఇవి సమాన్య ప్రజల కుటుంబ బడ్జెట్‌పై నేరుగా ప్రభావం చూపుతాయి. కాబట్టి సిలిండర్ బుక్ చేసుకునే ముందు మీ ప్రాంతంలో అమల్లో ఉన్న తాజా ధరలను సరిచూసుకోవడం, సబ్సిడీ ఖాతాలో జమ అయిందో లేదో తనిఖీ చేసుకోవడం మంచిది.

రైల్వే తత్కాల్ బుకింగ్ నిబంధనల్లో మార్పులు: రైల్వే ప్రయాణికులు ఉపశమనం కలిగిస్తూ ఆగస్ట్ 1 నుంచి రైల్వే శాఖ తత్కాల్ టికెట్ల విషయంలో కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. కొత్త విధానం ప్రకారం.. రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించబోతుంది. ఈ నిర్ణయంతో టోకెన్ కోసం ఒకసారి, బుకింగ్ కోసం మరోసారి క్యూలలో నిలబడే ఇబ్బంది తగ్గుతుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు, ఆఫ్‌లైన్ బుకింగ్‌లపై ఆధారపడే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

క్రెడిట్ కార్డ్ రివార్డులు, బ్యాంకింగ్ ఛార్జీలు: పలు ప్రముఖ బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ రివార్డ్ పాయింట్ల విధానం, ఇతర సర్వీస్ ఛార్జీలను సవరించనున్నాయి. ముఖ్యంగా కార్డ్ రకాన్ని బట్టి రివార్డ్ పాయింట్లు, రీఛార్జ్/ఇంధనం/షాపింగ్ క్యాష్‌బ్యాక్‌లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, వార్షిక రుసుముల్లో మార్పులు చేయనున్నాయి. అలాగే ఎస్‌ఎమ్‌ఎస్ అలర్టులు, డెబిట్ కార్డ్ నిర్వహణ, అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జీలను కూడా బ్యాంకులు అప్‌డేట్ చేసే అవకాశం ఉన్నందున వినియోగదారులంతా ఈ రూల్స్ పరిశీలించుకోవాలని సూచించారు.

ఐటీఆర్ ఫైలింగ్ గడువు : సాధారణ ఎవరైతే ట్యాక్స్ పేయర్స్ ఉంటారో వాళ్లు జూలై 31 లోపు ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఒక వేళ ఆన్‌ టైంలో ఐటీఆర్ ఫైల్ఓ చేయయకపోతే వారు ఆగస్టు1 నుంచి విలంబిత రిటర్న్ సమర్పించాల్సి ఉంటుంది. దీని వల్ల ఫైన్ పడే ఛాన్స్ ఉంది. కాబట్టి సమయానికి ఫైల్ చేయడం వల్ల రీఫండ్‌లు త్వరగా రావడమే కాకుండా, లోన్, వీసా దరఖాస్తులలో ఆలస్యం కాకుండా ఉంటుంది.

CKYC 2.0 ఫైనాన్షియల్ ఆన్‌బోర్డింగ్: ఫైనాన్షియల్ రంగంలో డిజిటల్ వెరిఫికేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు సెంట్రల్ నో యువర్ కస్టమర్ వ్యవస్థను ఆగస్టు నుంచి ఆర్థిక సంస్థలు మరింత వేగవంతం చేయనున్నాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, మ్యూచువల్ ఫండ్‌లలో కొత్త ఖాతాలు తెరిచేటప్పుడు ప్రతిసారీ పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా డిజిటల్ రికార్డుల ద్వారా వెరిఫికేషన్ పూర్తవుతుంది. ఈ ప్రక్రియ లేట్ కాకుండా స్పీడ్ జరిగిపోవాలి అనుకుంటే.. మీ మీ పేరు, చిరునామా, మొబైల్ నంబర్, గుర్తింపు కార్డులు అన్ని అప్‌డేట్‌లో ఉన్నాయో లేదో చూసుకోండి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...