Bhavishyavani: ప్రజలు వావి వరసలు లేకుండా వ్యవహరిస్తున్నారు.. అహంకారం ఎక్కువైంది.. రంగం భవిష్యవాణి ఇదే..

Date:

Rangam Bhavishyavani 2026: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల రంగం కార్యక్రమంలో మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది కుండపోత వర్షాలు కురుస్తాయని, అగ్ని ప్రమాదాలు, వరదల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రజల్లో అహంకారం పెరిగిందని, విలువలు తగ్గుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, విగ్రహ ప్రతిష్ఠ ఆలస్యం కాకూడదని సూచించారు.

సికింద్రాబాద్‌ ఉజ్జయిని అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. రంగం కార్యక్రమంలో భవిష్యవాణి వినిపించారు మాతంగి స్వర్ణలత. తాను సంతోషంగా రాలేదని.. క్రోధంతో వచ్చానన్నారు. నా మాట వినని మీకు నేను ఎందుకు సమాధానం చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ ప్రతిష్ఠ చేస్తానని చేయడంలేదన్నారు.. విగ్రహ ప్రతిష్ఠకు ఎవరు అడ్డుపడ్డా ఊరుకునేది లేదన్నారు. వర్షాలు పడవన్న ఆందోళన వద్దు.. అదే సమయంలో ప్రమాదాలు కూడా పెరుగుతాయంటూ హెచ్చరించారు.

భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘ఏ ఆపద వచ్చినా..ప్రమాదం వచ్చినా కాపాడుతున్నా.. మీరు చేసే చర్యల వల్ల నాకు ఆగ్రహం తెప్పిస్తోంది.. విగ్రహ ప్రతిష్ఠకు ఎవరుఅడ్డొచ్చినా ఊరుకోను.. ఈ ఏడాది కుండపోత వర్షాలు ఉన్నాయి.. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి.. అగ్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి.. వర్షాలతో ప్రజలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.. ఈ ఏడాది ప్రాణనష్టం భారీగా జరుగుతుంది’’.. అంటూ పేర్కొన్నారు.

‘‘వావి వరసలు లేకుండా ప్రజలు వ్యవహరిస్తున్నారు.. పిల్లలను తల్లిదండ్రులు ఊరి మీద వదిలేశారు.. నాకు సంతోషం లేకుండా ప్రజలు చేస్తున్నారు.. ప్రజలకు అహంకారం ఎక్కువైంది..తగ్గించుకోవాలి.. అంటూ.. భవిష్యవాణి వినిపిస్తూ.. మాతంగి స్వర్ణలత కంటతడి పెట్టారు. చాలా ఇబ్బంది పెడుతున్నారు..తృప్తి లేకుండా చేశారు.. దోశడంత ఇస్తే గోరంత కూడా పెట్టడంలేదు.. ఆరు మాసాల్లో విగ్రహ ప్రతిష్ఠ జరపకపోతే.. భారీగా ప్రాణనష్టం జరుగుతుంది.. నాకు అడ్డొచ్చినవారిని పాదాలకింద నలిపేస్తా..అంటూ పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...