రాయదుర్గంలో ఆధునిక స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌!

Date:

హైదరాబాద్‌ సిటీ: ఐటీ హబ్‌గా పేరుగాంచిన రాయదుర్గం త్వరలోనే రుచుల కేంద్రంగా కూడా గుర్తింపు పొందనుంది. సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అత్యాధునిక స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సుమారు 50కిపైగా ఫుడ్‌ స్టాల్స్‌తో, ఆధునిక సౌకర్యాలు, పరిశుభ్రమైన వాతావరణం, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళా ప్రదర్శనలతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు.

దీని కోసం సుమారు రూ.4 కోట్లను కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా మంజూరు చేసినట్లు సమాచారం. తుది పరిపాలనా అనుమతులు రాగానే పనులు ప్రారంభించనున్నారు. పట్టణ జీవనశైలికి అనుగుణంగా ఆహారం, ఉపాధి, సంస్కృతి, పర్యాటకం నాలుగు అంశాలను సమన్వయం చేస్తూ ఈ ఫుడ్‌ హబ్‌ను అభివృద్ధి చేయనున్నారు. ఒకే ప్రాంగణంలో విభిన్న రకాల తెలంగాణ, భారతీయ, అంతర్జాతీయ వంటకాలతోపాటు కూర్చునే వసతి, పార్కింగ్‌, పారిశుధ్య సదుపాయాలు కల్పించనున్నారు.

మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆధునిక వ్యాపార నిర్వహణలో అవకాశాలు కల్పించి, స్థిరమైన ఆదాయ వనరును సృష్టించేలా ఫుడ్‌ హబ్‌ను రూపొందిస్తున్నామని సీఎంసీ అర్బన్‌ కమ్యూనిటీ డెవల్‌పమెంట్‌ విభాగం అదనపు కమిషనర్‌ వీవీఎల్‌. సుభద్రా దేవి తెలిపారు. ఆసక్తి ఉన్న కళాకారులతో జానపద నృత్యాలు, సంగీత కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, యువ కళాకారుల ప్రతిభా ప్రదర్శనలకు అవకాశం ఇవ్వనున్నట్లు చెప్పారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...