ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచే!

Date:

  • ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల కోసం కీలక ప్రకటన వెలువడింది. ఆయా కార్యాలయాల్లో ఉద్యోగుల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. సర్కారు ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీలోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేసేందుకు సచివాలయ శాఖ సన్నాహాలు చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
  • కాగా ఏ సచివాలయంలో ఏ విభాగంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్నది ఈరోజే ఉమ్మడి జిల్లాల వారీగా ప్రకటించనున్నారు. అనంతరం అర్హులైన ఉద్యోగులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు గానూ అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా నవంబర్ 24ను నిర్ణయించారు. ఆ తర్వాత 25, 26వ తేదీలలో ఉద్యోగుల దరఖాస్తుల పరిశీలన నిర్వహించనున్నారు. చివరగా అభ్యర్థుల తుది సీనియారిటీ జాబితాను జిల్లా స్థాయిలో వెల్లడిస్తారు.
  • కొన్ని జిల్లాల్లో గ్రామ సర్వేరు, వెల్ఫేర్ అసిస్టెంట్, పంచాయతీ సెక్రటరీ వర్గాల్లో గణనీయంగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కొన్ని అర్బన్ వార్డుల్లో పెండింగ్ ట్రాన్స్‌ఫర్లు సమస్యగా మారాయి. ఈ బదిలీ ప్రక్రియ ఆ అవరోధాలను సర్దుబాటు చేసే అవకాశంగా భావిస్తున్నారు. అర్హులైన ఉద్యోగులు నవంబర్ 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఏ ఉద్యోగి ఏ కారణంగానైనా ఈ తేదీన దరఖాస్తు చేయకుంటే ఆ వ్యక్తి తదుపరి రౌండ్‌ వరకు వేచి చూడాల్సి వస్తుంది. అందువల్ల ఉద్యోగుల్లో దరఖాస్తుల కోసం రద్దీ ఏర్పడే అవకాశం ఉంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...