హల్దీ వేడుకలో స్మృతి మంధాన డ్యాన్స్ అదుర్స్..సందడి చేసిన వరల్డ్ కప్ విన్నర్స్

Date:

  • భారత మహిళా క్రికెట్ జట్టు వైస్-కెప్టెన్, డాషింగ్ బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి సందడి మొదలైంది. రేపు (నవంబర్ 23) మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్ఛల్‌ను పెళ్లి చేసుకోబోతున్న స్మృతి మంధాన, తాజాగా జరిగిన తన హల్దీ వేడుకతో అభిమానులను ఆకట్టుకుంది. ఈ వేడుకలో మంధాన తన భారతీయ టీమ్ మేట్స్‌తో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేసింది. అంతా పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ ఆ వేడుకకు ప్రత్యేక కళ తీసుకొచ్చారు.
  • మంధాన హల్దీ వేడుక డ్యాన్స్ ఫ్లోర్‌పై ఏకంగా ఏడుగురు భారత క్రికెట్ స్టార్లు సందడి చేశారు. షఫాలీ వర్మ, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, రేణుకా సింగ్, శివాలి షిండే, రాధా యాదవ్, జెమీమా రోడ్రిగ్స్ వంటి ఆటగాళ్లు అందరూ పసుపు దుస్తుల్లో వచ్చి హల్దీ థీమ్‌కు మ్యాచ్ అయ్యారు.
  • అందరూ కలిసి ఉత్సాహంగా పెళ్లి పాటలకు డ్యాన్స్ చేస్తూ, మంధాన పెళ్లి వేడుకను పండుగలా మార్చేశారు. ఈ స్నేహం, టీమ్ స్పిరిట్ చూడముచ్చటగా ఉంది. వరల్డ్ కప్ విన్నర్ షఫాలీ వర్మ, ఈ డ్యాన్స్ వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి లడ్కీ వాలే(వధువు తరపువారు) అని క్యాప్షన్ ఇచ్చింది.
  • ఈ వేడుక కేవలం పసుపు వేడుక మాత్రమే కాదు, ఇదొక చిన్న క్రికెట్ రీయూనియన్ లా మారింది. ఇటీవల మహిళల వరల్డ్ కప్ గెలిచిన జట్టులోని సభ్యులు—షఫాలీ, రాధా, రిచా, రేణుక, జెమీమా అందరూ కలిసి మంధాన పెళ్లి వేడుకలో పాల్గొనడం హైలైట్‌గా నిలిచింది. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో స్మృతి మంధాన సహచర క్రీడాకారిణి అయిన శివాలి షిండే కూడా ఈ సెలబ్రేషన్‌లో భాగమైంది. చాలా రోజుల తర్వాత పబ్లిక్‌గా కనిపించిన శ్రేయాంక పాటిల్ కూడా ఈ వేడుకలో పాల్గొనడం అభిమానులను ఆకట్టుకుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...