203 కోట్లు విడుదల చేయండి.. వైఎస్ షర్మిల డిమాండ్..

Date:

చేనేత వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు పలు డిమాండ్లు ఉంచారు. నేతన్నలకు రుణమాఫీ, చేనేతల వస్త్రాలపై జీఎస్టీ రద్దు, ముడి సరుకులను రాయితీతో అందించటంతో పాటుగా హ్యాండ్ లూమ్ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. ఏపీలోని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలతో చేనేతలను ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

నేతన్నలకు గుదిబండలా మారిన జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. చేనేత సహకార సంఘాలపై ఉన్న రుణాలను పూర్తిగా రద్దు చేయాలని.. సబ్సిడీ రూపంలో చెల్లించాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నేతన్నలకు రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలన్న షర్మిల.. వస్త్ర తయారీలో ఉపయోగించే ముడి సరుకులను సబ్సిడీ ధరలకు అందించాలని కోరారు. చేనేతలకు కేటాయించిన 11 రకాల వస్తువుల ఉత్పత్తుల రిజర్వేషన్లను అమలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు, కేంద్రంలో హ్యాండ్ లూమ్ బోర్డును తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారు. భారతీయ సాంస్కృతిక వైభవానికి, సంప్రదాయాలకు చేనేత ప్రతీకగా అభివర్ణించారు. “మన అస్థిత్వానికి అసలైన గుర్తింపు నిచ్చిన నేతన్నలకు, వారి కుటుంబ సభ్యులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. వెలకట్టలేని నైపుణ్యం, సృజనాత్మకత మన నేతన్న సొంతం. చేనేత వస్త్రాలను ధరిద్దాం.. నేతన్నల శ్రమను ఆదరిద్దాం..చేనేతల భవిష్యత్తుకు ఆసరాగా నిలుద్దాం.” అంటూ వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

ఇక ఇదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపైనా షర్మిల విమర్శలు గుప్పించారు. పన్నెండేళ్లుగా రాష్ట్రంలో చేనేతల పరిస్థితి దయనీయంగా మారిందని.. చేనేత ఉత్పత్తులపై ఐదు నుంచి 18 శాతం వరకూ కేంద్రం జీఎస్టీని మోపిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం విధానాలు, ప్రధాని మోదీ నిర్ణయాల కారణంగా నేతన్నల జీవితం సంక్షోభంలో పడితే.. సమగ్ర చేనేత విధానం, భరోసా, సబ్సిడీలు పునరుద్ధరణ, చేయూత, మూడు సెంట్ల భూమి, మరణించిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా అంటూ ప్రోత్సాహకాల పేరు చెప్పి టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు మోసం చేశాయని షర్మిల ఆరోపించారు. వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు రాష్ర్టంలోని 90 వేల కుటుంబాలకు ఉద్ధరించింది ఏమీలేదంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...