ఏలూరు జిల్లాలో పెద్దపులి కలకలం వరుసగా పశువులపై దాడి

Date:

జిల్లాలోని బుట్టాయిగూడెం మండలం గవరంపేటలో పెద్దపులి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. తాజాగా గ్రామ పరిసరాల్లో మూడు పశువులపై దాడి చేసి చంపినట్లు అధికారులు తెలిపారు. అంతకుముందు కామవరం సమీపంలో రెండు పశువులను పెద్దపులి చంపడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరుసగా పశువులపై దాడులు జరుగుతుండటంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు.

కొండ ప్రాంతాన్ని ఆవాసంగా చేసుకున్న పెద్దపులి. పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పులి కదలికలను రేడియో కాలర్ సిగ్నల్ ద్వారా నిరంతరం ట్రాక్ చేస్తున్నారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పులి సంచారం నేపథ్యంలో ప్రజలు ఒంటరిగా బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పశువుల కాపరులు, రైతులు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...