వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు: వైఎస్ సునీతా రెడ్డి

Date:

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కుమార్తె వైఎస్ సునీతా రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు విచారణలో అవకతవకలు ఉన్నాయని ఆరోపించారు. ఈరోజు(శనివారం) వైఎస్ వివేకా 75వ జయంతి సందర్భంగా పులివెందుల్లోని వివేకా సమాధి వద్ద కుమార్తె వైఎస్ సునీత కుటుంబ సభ్యులు నివాళులర్పించారు.

అనంతరం సునీత మీడియాతో మాట్లాడుతూ ‘నా తండ్రి వివేక హత్య కేసు విషయంలో గత ఆరునెలల కాలంగా జడ్జిమెంట్లు కూడా సరిగా లేవని నా అభిప్రాయం. విచారణలో అవకతవకలు ఉండడం వల్లే ఇన్నిసార్లు కోర్టుమెట్లు ఎక్కాల్సి వచ్చింది’ అని చెప్పుకొచ్చారు. ఏదో ఒకరోజు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటం కొనసాగిస్తూనే ఉంటానని సునీత అన్నారు. వివేక హత్య జరిగిందని అందరికంటే ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే తెలుసు అని సునీత పేర్కొన్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...