రాఖీ పౌర్ణమి రోజే గ్రహణం.. ఏ సమయంలో రాఖీ కట్టాలో తెలుసా?

Date:

హిందూ శాస్త్ర ప్రకారం, గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ గ్రహణ నియమాలను పాటిస్తారు. అయితే 2026 సంవత్సరంలో చంద్ర గ్రహణం రోజే రాఖీ పండుగ వచ్చేస్తోంది. కాగా, ఇప్పుడు మనం ఏ సమయంలో రాఖీ కట్టాలో వివరంగా తెలుసుకుందాం.

ఆగస్టు 28న చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే హిందూ శాస్త్రాల ప్రకారం, సూతక కాలంలో రాఖీ కట్టకూడదు అంటారు. అంతే కాకుండా ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు జరపరు. అలాగే ఆలయాలు కూడా మూససి వేస్తారు. అయితే ఈ సంవత్సరం 2026లో ఆగస్టు 28న, రాఖీ పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడనుంది.

అయితే ఈ గ్రహణం భారత్‌లో కనిపించదు అని చెబుతున్నారు పండితులు, ఖగోళశాస్త్ర నిపుణులు. అందువలన భారత్‌లో సూతక కాలం వర్తించదు. సూతక నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. అందువలన భారత దేశంలో రాఖీ పండుగ జరుపుకోవడానికి , గ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు. ఏ సమయంలోనైనా సరే రాఖీ కట్టుకోవచ్చునంట.

హిందూ ప్రజలు ప్రతి సంవత్సరం శ్రావణ పూర్ణిమ రోజు రాఖీ పండుగ వేడుకను జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టి, నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తారు. అంతే కాకుండా స్వీట్ పంచి, కుటుంబ సభ్యులంతా చాలా ఆనందంగా గడుపుతారు. అయితే ఈ సంవత్సరం పూర్ణిమ తిథి ఆగస్టు 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి, ఆగస్టు 28 శుక్ర వారం 9.48 వరకు ఉంటుంది.

అయితే పండితులు, ఉదయ తిథిని బట్టి ఆగస్టు 28న పండుగ జరుపుకోవాలని సూచించడం జరిగింది. ఇక ఈ రోజు10.46 నిమిషాల నుంచి, మధ్యాహ్నం 12.22 నిమిషాల వరకు రాహు కాలం, ఉంటుంది. ఈ రోజున భద్ర దోషం లేకపోవడం వలన ఏ సమయంలో రాఖీ కట్టినా శుభప్రదం. వీలైనంత వరకు ఉదయం 9.48 నిమిషాల వరకు రాఖీ కట్టుకోవడం చాలా మంచిదంట.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...