Cinema : హారర్ మూవీ లవర్స్‏కే వణుకు పుట్టించే సినిమా.. క్రైమాక్స్ చూసి బిత్తరపోవాల్సిందే.. ఓటీటీలో దూసుకుపోతున్న సిరీస్..

Date:

హారర్ సినీ ప్రియులకే భయం పుట్టించే సిరీస్ ఇప్పుడు ఓటీటీలో సంచలనం సృష్టిస్తుంది. కేవలం ఎనిమిది ఎపిసోడ్స్. కానీ ఒక్కో క్షణం థ్రిల్లింగ్ సస్పెన్స్ సీన్లతో సాగుతూ ఆద్యంతం మిమ్మల్ని సీట్లోనే కూర్చొబెడుతుంది. ఇక క్లైమాక్స్ మాత్రం అందరిని నివ్వెరబోయేలా చేస్తుంది. ఈసిరీస్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఇంతకీ ఈ సిరీస్ కథేంటో తెలుసుకుందామా

ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో ప్రతి వారం కొత్త సినిమాలు, సిరీస్ లు విడుదలవుతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం స్ట్రీమింగ్ అయిన కొద్ది గంటల్లోనే ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఒక హారర్ థ్రిల్లర్ డ్రామా ఓటీటీ సినీ ప్రియులను ఎంటర్టైన్ చేస్తుంది. ఇది కేవలం 8 ఎపిసోడ్స్ ఉంది. మొదటి సీజన్ నుంచే భారీ విజయం సాధించిన ఈ సిరీస్, భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ‘టాప్ 10’ ట్రెండింగ్ జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. నెట్‌ఫ్లిక్స్‌లో పెను సంచలనం సృష్టిస్తున్న ఈ కొరియన్ డార్క్-ఫాంటసీ సిరీస్ పేరు ‘ది ఈస్ట్ ప్యాలెస్’. ఇది ఒక కల్పిత జోసెయోన్ రాజవంశం. గత 30 సంవత్సరాలుగా భయంకరమైన శాపంతో బాధపడుతున్న ఈస్ట్ ప్యాలెస్ అనే రాజభవనం చుట్టూ తిరుగుతుంది. ఈ శాపం కారణంగా, రాజకుటుంబ వారసులు ఒకరి తర్వాత ఒకరు అత్యంత రహస్యమైన, దిగ్భ్రాంతికరమైన పరిస్థితులలో మరణిస్తూ, రాజసభ అంతటా భయాన్ని వ్యాపింపజేస్తున్నారు.

రాజు చివరి కుమారుడికి ముప్పు వాటిల్లినప్పుడు, అతను శాపం రహస్యాన్ని ఛేదించడానికి ఇద్దరు ప్రత్యేక వ్యక్తులను రహస్యంగా రాజభవనానికి పిలిపిస్తాడు. రాజు ఒక నైపుణ్యం గల భూతవైద్యుడిని, ఒక తాంత్రికుడిని పిలిపిస్తాడు. ఇంతలో, ఒక దాసి రాజభవనంలోకి ప్రవేశిస్తుంది, ఆమె నిజానికి రాజుకు దూరమైన కుమార్తె , తన తల్లి హత్య రహస్యాన్ని వెలికితీయడానికి అక్కడికి వచ్చింది. ఈ దాసికి అసంతృప్త ఆత్మలు , దెయ్యాలతో నేరుగా మాట్లాడగల అద్భుత శక్తి ఉంటుంది. ఆ తర్వాత, రాజభవనాన్ని పీడిస్తున్న భయంకరమైన ఆత్మలను ఎదుర్కోవడానికి తాంత్రికుడు , దాసి జతకడతారు. ఆ దర్యాప్తులో వెలుగులోకి వచ్చే వాస్తవం ఎంత భయంకరంగా ఉంటుందంటే, అది ఎవరినైనా వణికించేస్తుంది.

చోయ్ జంగ్-క్యూ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో ప్రముఖ కొరియన్ నటులు నామ్ జూ-హ్యూక్, రో యూన్-సో , చో సంగ్-వూ నటించారు. మానవ ప్రపంచం, ఆత్మ ప్రపంచం అయిన ‘గ్వి రాజ్యం’, అలాగే ప్రతీకారం తీర్చుకునే ఆత్మల కథను ఈ సిరీస్ లో చూడొచ్చు. ఉత్కంఠ, రహస్యాలు , భయంకరమైన సస్పెన్స్‌తో కూడిన కథలను ఇష్టపడేవారైతే, ఈ 8-ఎపిసోడ్‌ల సిరీస్ మీకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...