స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించిన ఎమ్మెల్యే పరిటాల

Date:

అమెరికా పర్యటనలో ఉన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. ప్రపంచస్థాయి విద్య, పరిశోధన, ఆవిష్కరణలకు కేంద్రంగా పేరొందిన యూనివర్సిటీ క్యాంపస్‌ను సందర్శించడం ప్రత్యేక అనుభూతిని కలిగించిందని ఆమె తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇదే యూనివర్సిటీలో ఎంబీఏ విద్యను అభ్యసించిన నేపథ్యంలో.. స్టాన్‌ఫోర్డ్ విశేషాలను ఆయనతో సునీత పంచుకున్నారు. నారా లోకేష్ చదివిన విద్యాసంస్థను స్వయంగా సందర్శించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

స్టాన్‌ఫోర్డ్ ఎంబీఏ ప్రోగ్రామ్ ప్రపంచంలోని ప్రముఖ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో ఒకటని, ఇందులో ప్రవేశం పొందడం ఎంతో కఠినమైన ప్రక్రియ అని సునీత తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న పలువురు పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీ నిపుణులు, ప్రముఖ కంపెనీల వ్యవస్థాపకులతో స్టాన్‌ఫోర్డ్‌కు అనుబంధం ఉందన్నారు. పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలను కూడా ఈ యూనివర్సిటీ అందించిందని పేర్కొన్నారు.

స్టాన్‌ఫోర్డ్‌లో పొందిన విద్య, అంతర్జాతీయ అనుభవం నారా లోకేష్‌ ఆలోచనా విధానంపై ప్రభావం చూపాయని సునీత అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఐటీ, విద్యారంగాల్లో ఆధునిక సంస్కరణలకు ఆయన ప్రాధాన్యం ఇస్తున్నారని, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన నారా లోకేష్ రాష్ట్ర మంత్రిగా సేవలందించడం గర్వకారణమని సునీత పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

పరందూర్ ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ రద్దు చేసిన సీఎం విజయ్.. రైతుల పోరాటానికి మద్దతిస్తూ సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో పరందూర్ ప్రతిపాదిత విమానాశ్రయం అంశం మరోసారి తీవ్ర చర్చకు...

రెండ్రోజులుగా కనిపించని కర్ణాటక ఐఏఎస్ అధికారి యూపీలో ప్రత్యక్షం.. కారణం ఏంటో చెప్పిన సర్కారు!

గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో...

50 ఏళ్ల వయసులో బైక్‌పై సంచలనం.. చరిత్ర సృష్టించిన తెలంగాణ మహిళా డాక్టర్!

50 ఏళ్ల వయసులోనూ సాహసం.. లేహ్-లడఖ్ బైక్ యాత్రతో చరిత్ర సృష్టించిన...

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...