ఆర్టీసీలో కారుణ్య నియామకాలు.. ఉత్తర్వులు జారీ చేసిన రవాణా శాఖ కార్యదర్శి

Date:

అమరావతి: ఏపీఎస్‌ఆర్టీసీలో మరోసారి కారుణ్య నియామకాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనారోగ్య కారణాలతో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన, మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు మొత్తం 76 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. ప్రభుత్వ అనుమతితో రవాణా శాఖ కార్యదర్శి కోన శశిధర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

మొత్తం 76 మందిలో 43 మంది మెడికల్‌ అన్‌ఫిట్‌ అయి పదవీ విరమణకు అనుమతి పొందినవారు, మరో 33 మంది మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఉన్నారు. జిల్లాస్థాయి కారుణ్య నియామకాల కమిటీల ద్వారా త్వరలో నియామక ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈపీఎఫ్‌ హయ్యర్‌ పెన్షన్‌పై ఉద్యోగుల వినతి

మరోవైపు ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు ఈపీఎఫ్‌ హయ్యర్‌ పెన్షన్‌ సమస్యలను పరిష్కరించాలని కోరారు. హైదరాబాద్‌లో ఈపీఎఫ్‌ ప్రాంతీయ కమిషనర్‌ శ్రీకాంత్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

సుమారు 6 వేల మంది ఉద్యోగుల తిరస్కరించిన హయ్యర్‌ పెన్షన్‌ దరఖాస్తులను జాయింట్‌ ఆప్షన్‌ కింద అనుమతించాలని కోరారు. అలాగే 2013, 2017 వేతన సవరణలను పరిగణనలోకి తీసుకుని హయ్యర్‌ పెన్షన్‌ లెక్కించాలని, 58 ఏళ్లు దాటిన ఉద్యోగుల నుంచి జమ చేసిన రూ.35 కోట్ల కంట్రిబ్యూషన్‌ను తిరిగి చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.

ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రత్యేక పీఎఫ్‌ కోడ్‌ కేటాయించాలని కూడా కోరగా.. సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఈపీఎఫ్‌ కమిషనర్‌ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...