బాపట్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ నరేంద్ర వర్మ గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ గారు, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాను

ఈ సందర్భంగా పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకానికి సెల్యూట్ చేశాను. అనంతరం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించాను. అనంతరం వివిధ ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శన, డాగ్ స్క్వాడ్ డెమోను తిలకించాను. ప్రజలకు అత్యున్నత సేవలు అందిస్తున్న పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులకు ప్రతిభా పురస్కారాలు, విశిష్ట సేవా మెడల్స్ అందించడంతో పాటు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్న చిన్నారులు, కళాకారులకు అవార్డులు ప్రదానం చేశాను.

