స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలు మనకు నిరంతరం స్ఫూర్తినిస్తాయి. ఆ స్ఫూర్తితో ప్రజల భద్రత, శాంతి కోసం మరింత అంకితభావంతో పనిచేయడం మన బాధ్యత.దేశ రక్షణలో ముందుండి సేవలందిస్తున్న పోలీసు సిబ్బందికి స్వీట్లు పంపిణీ చేసి, వారి సేవలకు అభినందనలు తెలియజేశాను.
దేశం కోసం.. ప్రజల కోసం.. నిరంతరం సేవ చేద్దాం. 🇮🇳


అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించడం ఎంతో గర్వంగా భావిస్తున్నాను.
అనకాపల్లి కేవలం ఒక జిల్లా మాత్రమే కాదు.. ఇది పోరాటాల నేల. అల్లూరి సీతారామరాజు విప్లవ స్ఫూర్తి, గురజాడ అప్పారావు సామాజిక చైతన్యం ఈ గడ్డ ప్రత్యేకతను చాటిచెబుతున్నాయి.ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యం నుంచి స్ఫూర్తి పొంది, వారు కలలుగన్న సంపన్నమైన, శాంతియుతమైన భారతదేశాన్ని నిర్మించేందుకు మనమందరం కృషి చేయాలి.
స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యంగా, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ ముందుకు సాగుతోంది.

