మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Date:

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, జెండాకు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితర మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ, సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు.

జాతీయ జెండాలు, పుష్పాలంకరణలతో టీడీపీ కేంద్ర కార్యాలయం పండుగ వాతావరణాన్ని తలపించింది. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...

ఒంటరి మహిళలే టార్గెట్.. మాటు వేసి చంపేస్తాడు.. రెండేళ్లలో ఇద్దరు!

మార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలం డీజీపేటలో జరిగిన మహిళ హత్య కేసును...