విశాఖపట్నం టు భోగాపురం ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌లు ప్రారంభం.. రెండు రూట్లలో బస్సులు, ఛార్జీల వివరాలివే

Date:

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో విశాఖపట్నం నుంచి ఎయిర్‌పోర్టుకు ఏపీ ఆర్టీసీ ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. రోజుకు 20 ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులు రెండు రూట్లలో నడవనున్నాయి. ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.

ASR-1, ASR-2 పేర్లతో ఈ సర్వీసులను నడుపుతున్నారు. పాత గాజువాక నుంచి మద్దిలపాలెం మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఉదయం 4.55 గంటలకు తొలి బస్సు బయల్దేరుతుంది. రాత్రి 7.45 గంటలకు చివరి సర్వీస్‌ ఉంటుంది.

ASR-1 రూట్‌, ఛార్జీలు

గాజువాక, ఎన్ఏడీ, గురుద్వార్‌, జూ పార్క్‌, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఎయిర్‌పోర్టు జంక్షన్‌ మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టుకు బస్సులు చేరుకుంటాయి.

ఛార్జీలు: పాత గాజువాక నుంచి రూ.400, ఎన్ఏడీ నుంచి రూ.350, గురుద్వార్‌ నుంచి రూ.300, జూ పార్క్‌ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఎయిర్‌పోర్టు జంక్షన్‌ నుంచి రూ.50.

ASR-2 రూట్‌, ఛార్జీలు

గాజువాక, సింధియా, రైల్వే స్టేషన్‌, బస్‌ స్టేషన్‌, సిరిపురం, ఇస్కాన్‌ టెంపుల్‌, ఐటీ హిల్స్‌, మారికవలస, ఆనందపురం, తగరపువలస, ఎయిర్‌పోర్టు జంక్షన్‌ మీదుగా ఈ సర్వీసులు నడుస్తాయి.

ఈ రూట్‌లో పాత గాజువాక, సింధియా, కంచరపాలెం నుంచి రూ.400, సిరిపురం నుంచి రూ.350, ఇస్కాన్‌ టెంపుల్‌ నుంచి రూ.300, ఐటీ హిల్స్‌ నుంచి రూ.250, మారికవలస నుంచి రూ.200, ఆనందపురం నుంచి రూ.150, తగరపువలస నుంచి రూ.100, ఎయిర్‌పోర్టు జంక్షన్‌ నుంచి రూ.50 ఛార్జీగా నిర్ణయించారు.

విమాన ప్రయాణికుల సౌకర్యార్థం ఉదయం నుంచి రాత్రి వరకు ఈ ఏరో ఎక్స్‌ప్రెస్‌ బస్సులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రయాణికులు తమకు అనుకూలమైన రూట్‌, ఛార్జీలను ముందుగా గమనించుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

కలుషిత బిర్యానీ తిన్న మహిళకు తీవ్ర అస్వస్థత.. కేఫ్‌కు రూ.96,500 జరిమానా వేసిన ఫోరం

వినియోగదారుల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కలుషిత ఆహారాన్ని విక్రయించిన కేరళలోని ఓ కేఫ్...

‘లిటిల్ ఫ్యాట్ బ్లాక్ షర్ట్’: కస్టమర్‌ను వెక్కిరిస్తూ బిల్లుపై నోట్ రాసిన కేఫ్ సిబ్బంది.. నెటిజెన్ల ఫైర్

బెంగళూరులోని ప్రముఖ ‘సబ్‌కో ది క్రాఫ్టరీ’ కేఫ్‌లో ఓ కస్టమర్‌కు చేదు...

మిస్ యూనివర్స్ ఇండియా 2026 విజేతగా కాజియా.. కిరీటం దక్కించుకున్న కేరళ అందాల భామ!

రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా నిర్వహించిన ప్రతిష్ఠాత్మక అందాల పోటీలో కేరళకు చెందిన...