చీరాలలో ఘనంగా ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ వేడుకలు

Date:

చీరాలలో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చీరాల ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు గడియార స్తంభం సెంటర్ నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఆర్డీవో నరసింహారావును కలిసి జర్నలిస్టులు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

ముఖ్యంగా జర్నలిస్టులకు అందిస్తున్న హెల్త్ స్కీమ్‌ను పారదర్శకంగా అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యాన్ని సమర్థవంతంగా అమలు చేసి జర్నలిస్టులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో జర్నలిస్టులకు తగిన ఆర్థిక, వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా ఉద్యోగ విరమణ అనంతరం జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించి, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు నివేశన స్థలాలు మంజూరు చేయాలని, జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి సీపీఎం, వివిధ ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని వారు పేర్కొన్నారు. APUWJ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన భద్రతపై కార్యక్రమంలో చర్చించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...

తమిళనాడు సర్కారు అదిరిపోయే పథకం.. ప్రభుత్వాసుపత్రుల్లో పిల్లలు పుడితే బంగారు ఉంగరం అందజేత

తమిళనాడులోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పుట్టే నవజాత శిశువులకు బంగారు కానుక అందించేలా...

IRCTC: హైదరాబాద్ నుంచి కాణిపాకం–శ్రీపురం.. 3 పుణ్యక్షేత్రాల దర్శనానికి టూర్ ప్యాకేజీ

కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్, శ్రీకాళహస్తి, తిరుచానూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలను...