విశాఖలో దారుణం.. మూడు మృతదేహాల లభ్యం..

Date:

విశాఖపట్నంలోని షీలానగర్ జంక్షన్‌ వద్ద మట్టికుప్పలో మూడు మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. షీలానగర్‌–సబ్బవరం పోర్టు కనెక్టివిటీ రోడ్డు నిర్మాణ పనుల కోసం మట్టిని లారీలోకి ఎత్తుతుండగా మృతదేహాలు కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతులు ఎవరనేది ఇంకా స్పష్టత రాలేదు.

మృతదేహాలు షీలానగర్‌ ప్రాంతానికి చెందినవారివా? ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అక్కడ పడేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, మృతదేహాలు మట్టికుప్పలోకి ఎలా వచ్చాయనే అంశాలపైనా విచారణ కొనసాగుతోంది.

మృతుల గుర్తింపు, మరణానికి గల కారణాలు పోస్టుమార్టం నివేదికతో పాటు దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి వివరాల కోసం విచారణ చేపట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

చక్కెర లేకుండానే మఖానా కీర్.. ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసా?

మఖానా కీర్‌ను ఇష్టపడని వారు చాలా అరుదుగా ఉంటారు. రుచితో పాటు...

పాల ప్యాకెట్‌పై ఎక్స్‌పైరీ డేట్ ఒక్కటే చూస్తున్నారా? ఈ 4 వివరాలు తప్పక తెలుసుకోండి!

మనదేశంలోని చాలా కుటుంబాల్లో ఉదయం ఒక కప్పు టీ, కాఫీ లేదా...

11 లక్షల టికెట్లు అమ్మిన ‘ఇరుముడి’.. ‘పెద్ది’ రికార్డు ధ్వంసం!

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో...

“52 సెకన్లు కూడా ఆగలేకపోయారా?”: జాతీయ గీతాన్ని అవమానించిన యూపీ స్పీకర్‌పై ఫైర్

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరో వివాదం చెలరేగింది. ఓ కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర...