గుడ్ న్యూస్.. ఆర్‌బీఐ సరికొత్త నిబంధనలు.. మారనున్న హోం, పర్సనల్ లోన్స్ ఈఎంఐలు..

Date:

రుణగ్రహీతలకు మరింత పారదర్శకత, ప్రయోజనం కల్పించేలా ఆర్‌బీఐ కొత్త డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఫ్లోటింగ్ రేట్ హోమ్, పర్సనల్, MSME రుణాలను బాహ్య బెంచ్‌మార్క్‌తో అనుసంధానం చేయడం, వడ్డీ రేట్లను నిర్దిష్ట వ్యవధిలోనే రీసెట్ చేయడం వంటి కీలక మార్పులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఆర్‌బీఐ రెపో రేటు మార్పుల ప్రభావం రుణాల EMIలు, కాలపరిమితిపై వేగంగా కనిపించే అవకాశం ఉంది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రుణగ్రహీతలకు మరింత మేలు చేకూర్చేలా, వడ్డీ రేట్ల నిర్ణయం, వాటి పునఃసమీక్ష (రీసెట్) విధానంలో పారదర్శకత పెంచేందుకు కొత్త డ్రాఫ్ట్ మార్గదర్శకాలను ప్రతిపాదించింది. ఈ నూతన నిబంధనలు ఏప్రిల్ 1, 2027 నుండి అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు ఫ్లోటింగ్ రేట్ రుణాలపై తమ ఇష్టానుసారం వడ్డీలను మార్చకుండా నియంత్రించడమే ఈ మార్పుల ముఖ్య ఉద్దేశమని ఆర్బీఐ పేర్కొంటోంది. ఆర్‌బిఐ ఫ్రేమ్‌వర్క్ ఇంకా ముసాయిదా దశలోనే ఉంది. సెప్టెంబర్ 11, 2026 వరకు అభిప్రాయాలను ఆహ్వానించారు. ఒకవేళ దీనికి తుదిరూపు ఇస్తే, ప్రతిపాదిత నియమాలు ఏప్రిల్ 1, 2027 నుండి అమల్లోకి రానున్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. దీనివల్ల ఇప్పటికిప్పుడు ఏం మార్పులు ఉండవు.. భవిష్యత్తులో ఆర్‌బిఐ రేట్ల కోతలు, పెంపులకు మీ రుణ రేటు స్పందించే విధానం గణనీయంగా మారవచ్చు..

ఈ నూతన నిబంధనలు హోమ్ లోన్లు, పర్సనల్ లోన్లు, MSME రుణాలు తీసుకునే వారిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుసుకుందాం.:

ఈ నూతన నిబంధనల ప్రకారం, వాణిజ్య బ్యాంకులు ఇచ్చే ఫ్లోటింగ్ రేట్ పర్సనల్, హోమ్, MSME రుణాలు అన్నింటినీ తప్పనిసరిగా ఆర్‌బిఐ రెపో రేట్ లేదా ట్రెజరీ బిల్లుల వంటి బాహ్య బెంచ్‌మార్క్ (External Benchmark) తోనే అనుసంధానించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, వడ్డీ రేట్ల మార్పు ప్రక్రియను కనీసం ప్రతి 3 నెలలకు ఒకసారి మాత్రమే చేయాలని ఆర్‌బిఐ స్పష్టం చేసింది. దీనివల్ల ఆర్‌బిఐ రెపో రేటు తగ్గించిన ప్రతిసారి, బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా 3 నెలల వ్యవధిలోనే వినియోగదారుల EMI లలో లేదా రుణ కాలపరిమితిలో తగ్గించి అందించాల్సి ఉంటుంది.

ఇక రుణ మంజూరు సమయంలోనే బ్యాంకులు స్పష్టమైన పారదర్శకతను పాటించాలి. ప్రతి లోన్ అగ్రిమెంట్ పత్రంలో వారు ఉపయోగిస్తున్న బెంచ్‌మార్క్ రేటు ఎంత, బ్యాంక్ లాభం లేదా మార్జిన్ (స్ప్రెడ్) ఎంత, అలాగే వడ్డీ రేట్లను రీసెట్ చేసే తేదీలు ఏమిటనే వివరాలను స్పష్టంగా పేర్కొనడం తప్పనిసరి.

ఇప్పటికే రుణాలు తీసుకుని పాత బెంచ్‌మార్క్ విధానాల్లో ఉన్న రుణగ్రహీతలకు కూడా ఈ నిర్ణయం ఊరట కలిగిస్తుంది. ఏప్రిల్ 1, 2029 నాటికి పాత పద్ధతిలోని రుణగ్రహీతలు ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉచితంగా కొత్త ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ విధానంలోకి మారడానికి ఆర్‌బిఐ అవకాశం కల్పించింది. ఈ మార్గదర్శకాలు అన్ని వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs), సహకార బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs), హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల (HFCs) కి వర్తిస్తాయి.

మొత్తానికి, ఈ నూతన విధానం వల్ల ఆర్‌బిఐ వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఆ ప్రయోజనం వేగంగా సామాన్య వినియోగదారులకు అందుతుంది. ఆర్‌బిఐ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు బ్యాంకులు ఆ ప్రయోజనాన్ని త్వరితగతిన కస్టమర్లకు అందించాల్సి ఉంటుంది. అయితే, బెంచ్‌మార్క్ రేట్లు పెరిగిన సమయంలో కూడా వడ్డీ రేటు ప్రతిబింబించే వేగం పెరిగి EMI లేదా రుణ వ్యవధి పెరిగే అవకాశం ఉంటుందనే విషయాన్ని రుణగ్రహీతలు గమనించాల్సి ఉంటుందని బ్యాంకింగ్ రంగం నిపుణులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...