NEET UG 2026 కౌన్సెలింగ్‌.. సీట్ల కేటాయింపు ఫలితాలు వాయిదా..! కారణం ఇదే

Date:

NEET UG 2026 కౌన్సెలింగ్‌ రౌండ్‌-1 సీట్‌ అలాట్‌మెంట్‌ ఫలితాలు విడుదల వాయిదా పడింది. ఆగస్టు 19న విడుదల కావాల్సిన ఫలితాన్ని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) ఆగస్టు 21న విడుదల చేయనుంది. సీటు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22 నుంచి 31 వరకు సంబంధిత కాలేజీల్లో రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుంది..

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 20: NEET UG 2026 కౌన్సెలింగ్‌ రౌండ్‌-1 సీట్ల కేటాయింపు ఫలితాన్ని మెడికల్‌ కౌన్సెలింగ్‌ కమిటీ (MCC) వాయిదా వేసింది. ఆగస్టు 19న విడుదల కావాల్సిన సీట్‌ అలాట్‌మెంట్‌ ఫలితాన్ని ఆగస్టు 21, 2026న విడుదల చేయనున్నట్లు MCC ప్రకటించింది. రౌండ్‌-1 కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ mcc.nic.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. సీటు కేటాయింపు పొందిన అభ్యర్థులు ఆగస్టు 22 నుంచి 31 వరకు సంబంధిత విద్యాసంస్థల్లో రిపోర్ట్‌ చేసి అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. చేరిన అభ్యర్థుల డేటాను ఆయా విద్యాసంస్థలు సెప్టెంబర్‌ 1, 2026న ధ్రువీకరించనున్నాయి.

NEET UG Seat Allotment Result 2026 ఫలితాలు ఎలా చెక్‌ చేసుకోవాలంటే..?

  • ముందుగా MCC అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోంపేజీలో ఉన్న NEET UG Seat Allotment Result 2026 లింక్‌పై క్లిక్‌ చేయాలి.
  • కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో అడిగిన లాగిన్‌ వివరాలను నమోదు చేయాలి.
  • Submitపై క్లిక్‌ చేయాలి.
  • స్క్రీన్‌పై సీట్‌ అలాట్‌మెంట్‌ ఫలితం కనిపిస్తుంది.
  • ఫలితాన్ని చెక్‌ చేసి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • భవిష్యత్‌ అవసరాల కోసం ప్రింట్‌అవుట్‌ తీసుకుని భద్రపరుచుకోవాలి.

ఏయే సీట్లకు MCC కౌన్సెలింగ్‌?

MCC/DGHS ఆధ్వర్యంలో పలు కేటగిరీలకు సంబంధించిన మెడికల్‌ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. ఇందులో 15 శాతం ఆల్‌ ఇండియా కోటా (AIQ), 100 శాతం డీమ్డ్‌ యూనివర్సిటీలు, ఢిల్లీ యూనివర్సిటీ, AMU, BHU వంటి సెంట్రల్‌ యూనివర్సిటీలు ఉన్నాయి. అలాగే ESIC, AFMC (రిజిస్ట్రేషన్‌ భాగం మాత్రమే), I.P. యూనివర్సిటీకి చెందిన VMMC & SJH, ABVIMS & RML, ESIC Dental Delhi తదితర సంస్థల సీట్లు కూడా ఈ కౌన్సెలింగ్‌ పరిధిలోకి వస్తాయి. అదేవిధంగా 100 శాతం AIIMS సంస్థలు, 100 శాతం JIPMER సీట్లకు కూడా MCC కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుంది. B.Sc Nursingకు సంబంధించి కేంద్ర సంస్థల్లోని సీట్లకు కూడా ఈ కౌన్సెలింగ్‌ వర్తిస్తుంది. అభ్యర్థులు సీట్‌ అలాట్‌మెంట్‌, రిపోర్టింగ్‌ తేదీలు, తదుపరి కౌన్సెలింగ్‌ ప్రక్రియకు సంబంధించిన తాజా వివరాల కోసం MCC అధికారిక వెబ్‌సైట్‌ను పరిశీలించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...