Weather Report: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో 3రోజులు భారీ వర్షాలు..

Date:

వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగురాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలోని రుతుపవణ ద్రోణి, అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కాబట్టి వాతావారణ శాఖ ప్రకారం ఏ జిల్లాల్లో వర్షాలు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం.

ఏపీ, తెలంగాణలకు భారత వాతావరణ శాఖ మరోసారి వర్ష సూచనలు జారీ చేసింది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి అమృత్‌సర్, నజీబాబాద్, ఫతేఘర్, హర్దోయ్, ఈశాన్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన కేంద్రం, దిఘా మీదుగా కొనసాగుతూ అక్కడి నుండి ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉందని దీని ప్రభావంతో రెండు తెలుగురాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ వాతావరణం

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో వర్షాలు

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. శనివారం ఉరుములతో కూడిన వర్షాలతో పాటు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతోబలమైన ఈదురుగాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో వర్షాలు

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లో వర్షాలు గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. అలాగే శుక్ర, శనివారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది.

రాయలసీమలో వర్షాలు

ఇక రాయల సీమలో రాబోయే మూడ్రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురుస్తాయని.. వర్షాల సమయంలో గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు కూడా వీస్తాయని.. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.

తెలంగాణలో వర్షాలు

అటు తెలంగాణలోనూ గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. శనివారం రోజు రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు , 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Raksha Bandhan 2026: రాఖీ పండుగపై క్లారిటీ.. ఆగస్టు 28నే రక్షాబంధన్‌.. శుభ ముహూర్తం ఇదే!

రక్షాబంధన్‌ పండుగ తేదీపై నెలకొన్న సందేహాలకు పండితులు స్పష్టత ఇచ్చారు. 2026లో...

వర్షాకాలంలో ఖర్జూరాలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? డాక్టర్లు చెప్పిన విషయాలు ఇవే!

ఖర్జూరాలు ప్రకృతి అందించిన తీపి, పోషక విలువలు కలిగిన పండ్లలో ఒకటి....

‘పాకిస్థాన్‌ది ఆక్రోశం’.. కశ్మీర్‌ గురించి అమెరికా రాయబారి వ్యాఖ్యలకు సమన్లు జారీపై భారత్ స్పందన

జమ్మూ కశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగమేనని న్యూఢిల్లీ మరోసారి స్పష్టం చేసింది. కశ్మీర్‌లో...

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సూట్ అవుతుందా? ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం జాగ్రత్త!

డ్రాగన్ ఫ్రూట్ అందరికీ సరిపోతుందా? డ్రాగన్ ఫ్రూట్‌ చూడటానికి ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా,...