
గత రెండు రోజులుగా ఆచూకీ లేకుండా పోయారంటూ సామాజిక, వార్తా మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరిగిన కర్ణాటక కేడర్ ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ వ్యవహారంపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఆయన ఎక్కడికీ వెళ్లిపోలేదని, తన తండ్రి తీవ్ర గుండెజబ్బుతో బాధపడుతుండటంతో అత్యవసర పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి వెళ్లారని రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రియాంక్ ఖార్గే వెల్లడించారు.
కేవలం సమాచార లోపం కారణంగానే ఈ పరిణామంపై అనుమానాలు, ప్రచారం ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. ఇటీవల కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్‌సీ) కార్యాలయంలో జరిగిన ఈడీ దాడులకు, జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ స్వగ్రామానికి వెళ్లిన ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ప్రియాంక్ ఖార్గే స్పష్టం చేశారు.
గత రెండు రోజులుగా కర్ణాటక కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ అదృశ్యమయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ వ్యవహారంపై ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఆయన ఎక్కడికీ వెళ్లిపోలేదని, తన తండ్రి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో అత్యవసరంగా ఉత్తరప్రదేశ్‌లోని స్వగ్రామానికి వెళ్లారని రాష్ట్ర కేబినెట్ మంత్రి ప్రియాంక్ ఖర్గే వెల్లడించారు.
అధికారి అందుబాటులో లేకపోవడానికి కారణం కుటుంబంలో నెలకొన్న అత్యవసర పరిస్థితేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ స్వగ్రామానికి వెళ్లిన ఘటనకు ఇటీవల కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ (కేపీఎస్‌సీ) కార్యాలయంలో జరిగిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది.
మిస్సింగ్ ప్రచారానికి దారితీసిన పరిణామాలు
2016 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ ప్రస్తుతం కర్ణాటక పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని ఎంఎస్‌ఎంఈ విభాగం డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఆగస్టు 20 నుంచి ఆయన అధికారిక ఫోన్ స్విచ్‌ఆఫ్‌లో ఉండటంతో పాటు అందుబాటులోకి రాకపోవడం సచివాలయ వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. జ్ఞానేంద్ర కుమార్ గంగ్వార్ బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎందుకు అందుబాటులో లేరు? అనే అంశాలపై చర్చ మొదలైంది. ఈ క్రమంలో మీడియాలో భిన్న కథనాలు వెలువడటంతో ప్రభుత్వం అప్రమత్తమై అసలు విషయాన్ని తెలుసుకునేందుకు రంగంలోకి దిగింది.

