
అయోధ్య రామమందిర విరాళాల చోరీ, నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆలయ నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా కొనసాగించేందుకు పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలిసారిగా ఆలయ ట్రస్ట్‌కు సీఈఓను నియమించనుంది.
ఈ పదవికి మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాను ట్రస్ట్ ఎంపిక చేసింది. సీఈఓ పోస్టు కోసం దేశవ్యాప్తంగా 5,500 మందికి పైగా దరఖాస్తులు అందగా, పలు దశల్లో వడపోత ప్రక్రియ నిర్వహించారు. చివరకు 16 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేసి, వారిలో జితేంద్ర మిశ్రాను సీఈఓగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
అయోధ్య రామమందిరానికి తొలి CEOగా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా
అయోధ్య రామమందిర నిర్వహణకు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా మాజీ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు. శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ సమావేశంలో ఆయన నియామకంపై తుది నిర్ణయం తీసుకున్నారు.
రామమందిర CEO పదవి కోసం మొత్తం 5,585 దరఖాస్తులు అందగా, వాటిని వడపోసిన అనంతరం తుది దశకు ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఎంపిక చేశారు. వీరిలో జితేంద్ర మిశ్రా పేరును ట్రస్ట్ తుది నిర్ణయంగా ఖరారు చేసింది.
ట్రస్ట్ ఛైర్మన్ నృత్య గోపాల్‌దాస్ నివాసంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో CEO ఎంపిక కమిటీ తన తుది నివేదికను సమర్పించింది. కమిటీ ప్రతిపాదించిన ముగ్గురు పేర్లను పరిశీలించిన అనంతరం జితేంద్ర మిశ్రాను CEOగా నియమించాలని నిర్ణయించారు.
జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో సుమారు 39 ఏళ్ల పాటు సేవలందించారు. ఆయన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రామమందిర నిర్వహణ బాధ్యతలను అప్పగించినట్లు తెలుస్తోంది.
జితేంద్ర మిశ్రా భారత వైమానిక దళంలో పలు కీలక, ఉన్నత స్థాయి పదవుల్లో సేవలందించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో వెస్ట్రన్ కమాండ్‌కు చీఫ్‌గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వైమానిక దళం నుంచి పదవీవిరమణ చేసిన మిశ్రాను తాజాగా అయోధ్య రామమందిరం ట్రస్ట్ సీఈఓగా ఎంపిక చేశారు. రామమందిర విరాళాల నిర్వహణకు సంబంధించి గతంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఆలయ పరిపాలనను మరింత సమర్థంగా నిర్వహించడం, ఆర్థిక వ్యవహారాల్లో పారదర్శకతను పెంపొందించడం వంటి కీలక బాధ్యతలు ఆయనపై ఉండనున్నాయి.
ఆపరేషన్ సింధూర్ సమయంలో అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మిశ్రాకు సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకాన్ని ప్రదానం చేశారు. యుద్ధం, వివాదం లేదా సైనిక సంఘర్షణల సమయంలో అత్యున్నత స్థాయి విశిష్ట సేవలను అందించిన వారికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన, అరుదైన సైనిక పురస్కారాల్లో ఇది ఒకటి.
మిశ్రా నియామకంతో రామమందిర ట్రస్ట్‌కు కార్యాచరణ ప్రణాళిక, సమన్వయం, లాజిస్టిక్స్, భారీ స్థాయిలో విభాగాలు మరియు బలగాల నిర్వహణలో విశేష అనుభవం కలిగిన సీనియర్ నాయకత్వం అందుబాటులోకి రానుంది. ఆయన సుదీర్ఘ సైనిక అనుభవం ఆలయ పరిపాలనను మరింత క్రమబద్ధీకరించడంతో పాటు, నిర్వహణా వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలకంగా మారే అవకాశం ఉంది.
