నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావం బీహార్‌పై తీవ్రంగా పడింది. గండ్లక్‌ నదితో పాటు దాని పరివాహక ప్రాంతాలు వరద నీటితో పూర్తిగా మునిగిపోయాయి. ఈ క్రమంలో వరద నీటితో పాటు గండ్లక్‌ నదిలోకి గుర్తుతెలియని, విచిత్రమైన చేపలు పెద్ద సంఖ్యలో కొట్టుకొచ్చాయి.

ఈ విషయం అధికారుల దృష్టికి రావడంతో బీహార్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమ చంపారన్‌, గోపాల్‌గంజ్‌ జిల్లాల ప్రజలు ఈ చేపలను తినడం లేదా విక్రయించడం చేయవద్దని మత్స్య శాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది.

వరదల కారణంగా కలుషితమైన నీటిలో కొట్టుకొచ్చిన ఈ చేపల్లో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల చేపలపై పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి, అధికారికంగా ధృవీకరించే వరకు వాటికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల ప్రభావంతో బీహార్‌లోని గండ్లక్‌ నదీ పరివాహక ప్రాంతం మొత్తం జలమయమైంది. వరద నీటితో పాటు నేపాల్‌ సరిహద్దుల నుంచి గతంలో ఎన్నడూ చూడని విచిత్రమైన, గుర్తుతెలియని చేపలు గండ్లక్‌ నదిలోకి, మైదాన ప్రాంతాల్లోని చెరువులు, ఇతర జలాశయాల్లోకి కొట్టుకొచ్చాయి.

ఈ పరిణామంపై బీహార్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. పశ్చిమ చంపారన్‌, గోపాల్‌గంజ్‌ జిల్లాల ప్రజలను హెచ్చరిస్తూ రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ అత్యవసర అడ్వైజరీ జారీ చేసింది. ఈ గుర్తుతెలియని చేపల జాతి, వాటి భద్రతపై స్పష్టత వచ్చే వరకు వాటిని ఆహారంగా తీసుకోవడం లేదా విక్రయించడం పూర్తిగా నిషేధించాలని అధికారులు ఆదేశించారు.

చేపలపై నిపుణుల పరిశీలన, అధికారిక ధృవీకరణ పూర్తయ్యే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద చేపలను పట్టుకోవడం, విక్రయించడం లేదా వినియోగించడం చేయవద్దని శాఖ సూచించింది.

వరదల సమయంలో చెరువులు, నదుల్లోని చేపలు నీటి ఉధృతికి కొట్టుకుపోయి వందల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే అవకాశం ఉందని మత్స్య శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో అవి మురుగునీటి కాలువలు, చనిపోయిన జంతువుల కళేబరాలు, వివిధ రకాల రసాయన వ్యర్థాలతో సంబంధంలోకి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

దీంతో చేపల శరీరంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగస్ వంటి వ్యాధికారక సూక్ష్మజీవులు చేరే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల వరదల అనంతరం లభించే చేపలను కేవలం సాధారణ చేపలను పోలి ఉన్నాయనే కారణంతో తినేందుకు సురక్షితమైనవిగా భావించరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా వింతగా లేదా అసాధారణంగా కనిపించే చేపలను తినకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *