ఆంధ్రప్రభ వెబ్‌, బిజినెస్ ప్రతినిధి: బంగారం ధరలు ఈ రోజు (సెప్టెంబర్‌ 11) భారీగా తగ్గాయి. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు దిగిరావడంతో దేశీయంగా కూడా బంగారం ధరలు తగ్గాయి. నిన్న పెరిగిన ధరలకు భిన్నంగా గురువారం పసిడి ధరల్లో గణనీయమైన తగ్గుదల నమోదైంది. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించింది.

సెప్టెంబర్‌ 11న 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.15,289గా నమోదైంది. క్రితం రోజుతో పోలిస్తే గ్రాముపై రూ.262 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి గ్రాము ధర రూ.14,015కు చేరింది. ఇది ఒక్కరోజులో రూ.240 తగ్గుదల. ఇక 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,467గా ఉంది. ఇది గ్రాముపై రూ.196 తగ్గింది.

అంతర్జాతీయ మార్కెట్‌లోనూ తగ్గుదల

అంతర్జాతీయ స్పాట్‌ మార్కెట్‌లోనూ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఔన్స్‌ బంగారం ధర 4,352.47 డాలర్లకు చేరగా.. క్రితం రోజుతో పోలిస్తే 13.30 డాలర్లు తగ్గింది. గ్రాము బంగారం ధర 139.95 డాలర్ల వద్ద నమోదైంది. ఇది 0.41 డాలర్ల తగ్గుదల.

డిజిటల్‌ బంగారం ధర గ్రాముకు సుమారు రూ.15,550 నుంచి రూ.16,350 మధ్య కొనసాగుతోంది.

10 గ్రాములపై రూ.2,620 తగ్గుదల

24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ప్రస్తుతం రూ.1,52,890గా ఉంది. క్రితం రోజుతో పోలిస్తే 10 గ్రాములపై రూ.2,620 తగ్గింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,40,150గా నమోదైంది. అంటే 10 గ్రాములపై రూ.2,400 తగ్గుదల కనిపించింది.

By Ramya