ఎఫెక్ట్‌ మామూలుగా లేదుగా.. దేశవ్యాప్తంగా ఇండక్షన్ స్టవ్‌లను ఎగబడి కొంటున్న జనాలు

Date:

దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరత, సరఫరా అంతరాయం కారణంగా ఇండక్షన్ కుక్‌టాప్‌ల విక్రయాలు ఒక్కసారిగా పెరిగాయి. ఎల్పీజీ అందుబాటులో లేకపోవడంతో సాధారణ కుటుంబాలు, హోటల్ యజమానులు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేయడానికి దుకాణాలు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల వైపు పరుగులు పెడుతున్నారు. స్థానిక విక్రేతలతో పాటు ఈ-కామర్స్ సంస్థలు కూడా ఇటీవల రోజుల్లో ఇండక్షన్ స్టవ్‌ల అమ్మకాలు గణనీయంగా పెరిగాయని చెబుతున్నాయి. ముఖ్యంగా Flipkart, Amazon వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో డిమాండ్ ఒక్కసారిగా పెరిగినట్లు సమాచారం.

ఫ్లిప్‌కార్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గత నాలుగు నుంచి ఐదు రోజులలో ఇండక్షన్ కుక్‌టాప్‌ల అమ్మకాలు గత మూడు నుంచి నాలుగు వారాల కంటే మూడు రెట్లు పెరిగాయి. ముఖ్యంగా Delhi, Kolkata, Uttar Pradesh ప్రాంతాల్లో ఎక్కువగా కొనుగోళ్లు నమోదయ్యాయి. ప్రస్తుత గ్లోబల్ పరిస్థితుల నేపథ్యంలో ఇండక్షన్ కుక్‌టాప్‌లు ఒకప్పుడు కిచెన్ అప్‌గ్రేడ్‌గా భావిస్తే ఇప్పుడు చాలా కుటుంబాలకు అవి అవసరమైన ప్రత్యామ్నాయంగా మారాయని ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి తెలిపారు. ఎల్పీజీ ధరలు పెరగడం, సరఫరా సమస్యలు రావడం వంటి కారణాల వల్ల వినియోగదారులు ముందుగానే ఇండక్షన్ స్టవ్‌లను కొనుగోలు చేస్తున్నారని చెప్పారు.

ఇక Amazon India కూడా ఇండక్షన్ కుక్‌టాప్‌లకు భారీ డిమాండ్ నమోదైందని వెల్లడించింది. సాధారణ రోజులతో పోలిస్తే గత 24 గంటల్లో Amazon.in వెబ్‌సైట్‌లో ఇండక్షన్ స్టవ్‌లకు 20 రెట్లు ఎక్కువ డిమాండ్ వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఇక ఆఫ్‌లైన్ దుకాణాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా ముంబైలోని పలు ఎలక్ట్రానిక్ స్టోర్లలో ఇండక్షన్ స్టవ్‌ల కొనుగోళ్లు, విచారణలు గణనీయంగా పెరిగాయని విక్రేతలు చెబుతున్నారు.

థానేలోని మన్‌పాడా ప్రాంతంలో ఉన్న గోల్డెన్ స్టీల్ అండ్ అప్లయెన్సెస్ స్టోర్ మేనేజర్ సాగర్‌ సత్రా మాట్లాడుతూ.. గతంలో రోజుకు 5 నుంచి 7 గ్యాస్ స్టవ్‌లు అమ్ముడవుతుండగా, వారానికి 2–3 ఇండక్షన్ స్టవ్‌లు మాత్రమే అమ్ముడయ్యేవని తెలిపారు. అయితే గత వారం రోజులుగా ఇండక్షన్ స్టవ్‌ల విక్రయాలు వారానికి 10 వరకు చేరి ఐదు రెట్లు పెరిగాయని చెప్పారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

టీడీపీ మహానాడు వేదిక మార్పు?.. ప్రధాని మోదీ ఏపీ పర్యటన ఎఫెక్ట్, ఎక్కడికి మారుస్తున్నారంటే!

టీడీపీ పసుపు పండుగగా చెప్పే మహానాడును ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు. ఈ...

ఇరాన్‌పై మరో దాడి వద్దు”: డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించిన పుతిన్

ఇరాన్‌పై యుద్ధం ముదరకుండా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా రంగంలోకి...

ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. మరోసారి భారీగా నిధుల విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరోసారి నిధులను విడుదల చేసింది. దీనదయాళ్ అంత్యోదయ...

ప్రేమలో ‘బుట్టబొమ్మ’.. బాలీవుడ్ హీరోతో పూజా హెగ్డే సీక్రెట్ డేటింగ్?..ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రేమలో పడినట్లు గత కొన్ని...