I Bomma one.. పోలీసులకు ఛాలెంజ్ విసురుతున్న పైరసీ మాఫియా!

Date:

ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయిన క్రమంలో ఆన్లైన్ పైరసీకి చెక్ పడిందని అందరూ భావించారు. అయితే ఒకడు పోతే ఇంకొకడు అన్నట్టు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఐ బొమ్మ ప్లేస్ లో ఐ బొమ్మ వన్ అనే మరో వెబ్సైట్ తెరపైకి వచ్చింది. ఆన్లైన్ పైరసీ ప్రపంచంలో కొత్తగా వచ్చిన ఐ బొమ్మ వన్ సరికొత్త పైరేటెడ్ సినిమాలతో ప్రత్యక్షమైంది.

ఐ బొమ్మ ఎకో సిస్టంలో సుమారు 65 మిర్రర్ వెబ్సైట్లు ఉన్నాయని పోలీసులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెరపైకి వచ్చిన ఐ బొమ్మ వన్ కూడా ఆ మిర్రర్ వెబ్సైట్లో ఒకటి కావచ్చని భావిస్తున్నారు. గతంలో ఐ బొమ్మ, బప్పం వంటి పైరసీ వెబ్సైట్లో నడిపించిన ఇమ్మడి రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ కొత్త వెబ్సైట్ వెలుగులోకి రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

పోలీసులకు సవాల్ గా ఐ బొమ్మ వన్ రవి సెల్ ఫోన్ మొత్తంలో ఫుడ్ డెలివరీ బాయ్స్ నెంబర్లు మాత్రమే ఉండడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. ఇక ఇదే సమయంలో ఐ బొమ్మ వన్ ప్రత్యక్షం కావడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. సినీ వర్గాలలోను ప్రస్తుతం ఐ బొమ్మ వన్ పైన చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇమ్మడి రవిని సపోర్ట్ చేసిన చాలామంది నెటిజన్లు ఐ బొమ్మ వన్ విషయంలో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం ముందు ముందు మరే మలుపు తిరుగుతుంది అనేది వేచి చూడాలి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...