రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సంజీవని ప్రాజెక్టు అమలుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆరోగ్యశాఖ కమిషనర్‌ చక్రధర్‌బాబు తెలిపారు. ఈ ప్రాజెక్టును పీపీపీ విధానంలో అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) కింద అమలవుతున్న వివిధ పథకాల పురోగతి, పనితీరును సమీక్షించేందుకు రెండు కేంద్ర బృందాలు శనివారం రాష్ట్రానికి చేరుకున్నాయి. ఈ బృందాలు ఆదివారం నుంచి ఈ నెల 26వ తేదీ వరకు అల్లూరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించనున్నాయి.

ఈ నేపథ్యంలో శనివారం కేంద్ర బృందాల ప్రతినిధులతో కమిషనర్‌ సమావేశమయ్యారు. డిసెంబరు 10న రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టుకు సంబంధించి ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించనున్నట్లు చక్రధర్‌బాబు వివరించారు. అనంతరం జనవరి 1 నుంచి రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.

By Rajini

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *