Anand Mahindra: ఇక ఏడాది పొడవునా మామిడి పండ్లు! రైతు అద్భుత ప్రయోగానికి ఆనంద్ మహీంద్రా ఫిదా ..!

Date:

Anand Mahindra: ఓ రైతుపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం కురిపించారు. సోషల్‌ మీడియాలో రైతును ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. తాను ఆ రైతుకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తానని స్పష్టం చేశారు. ఇక మామిడి పండ్ల సీజన్‌ ముగియదని, ఏడాది పొడవునా.

మామిడి పండు పేరు చెబితేనే నోరూరని వారుండరు. అయితే, వేసవి కాలం అయిపోగానే మామిడి సీజన్ కూడా ముగిసిపోతుందనే బాధ అందరిలోనూ ఉంటుంది. కానీ, ఇకపై ఆ చింత అక్కర్లేదని నిరూపిస్తున్నారు రాజస్థాన్‌లోని కోటాకు చెందిన ఒక సామాన్య రైతు. ఆయన పట్టుదల, ప్రయోగాత్మక ఆలోచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

కోటా సమీపంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన శ్రీ కిషన్ సుమన్ మొదట్లో గోధుమలు, వరి పండించేవారు. అయితే వ్యవసాయంలో రాబడి స్థిరంగా లేకపోవడంతో ఆయన కొత్త దారి వెతికారు. మొదట పూల సాగు వైపు మళ్లిన ఆయన, ఒకే గులాబీ మొక్కపై ఏడు రంగుల పూలు వికసించేలా చేసి తనలోని సృజనాత్మకతను చాటుకున్నారు. ఆపై ఆయన దృష్టి మామిడి సాగుపై పడింది.

సుమారు పదేళ్ల క్రితం సుమన్ తన తోటలో ఒక ప్రత్యేకమైన మామిడి చెట్టును గమనించారు. అది మిగిలిన చెట్లలా కాకుండా ఏడాది పొడవునా పూలు పూస్తూ కనిపించింది. దీనిపై సుమన్ అనేక ప్రయోగాలు, గ్రాఫ్టింగ్ (అంటుకట్టడం) ప్రక్రియలు చేపట్టి ‘సదాబహార్’ అనే కొత్త రకాన్ని అభివృద్ధి చేశారు.

వ్యవసాయం అంటే కేవలం సాంప్రదాయ పద్ధతులు మాత్రమే కాదు, ఊహకు అందని ఆవిష్కరణలు కూడా అని సుమన్ నిరూపించారు. ఈ ‘సదాబహార్’ మామిడి రకం గనుక అన్ని వాతావరణ పరిస్థితుల్లో విజయవంతమైతే, రైతుల ఆదాయం రెట్టింపు అవ్వడమే కాకుండా, వినియోగదారులకు ఏడాది పొడవునా పండ్ల రాణి ‘మామిడి’ అందుబాటులో ఉంటుంది. శ్రీ కిషన్ సుమన్ ప్రయాణం ప్రతి రైతుకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తకు ఒక గొప్ప స్ఫూర్తి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Hyderabad: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగంపై కీలక అప్డేట్.. 2 ప్యాకేజీలుగా మార్పు, టెండర్లకు ఆహ్వానం

రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) ఉత్తర భాగం పనులపై కీలక అప్డేట్...

ఏపీలో రిలయన్స్‌ డేటాసెంటర్‌.. చంద్రబాబు సర్కార్ భారీ ప్రోత్సాహకాలు, ఏకంగా వేల కోట్లు!

విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ డేటా సెంటర్‌కు ఏపీ ప్రభుత్వం...

మాట నిలబెట్టుకున్న టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. పదో తరగతి విద్యార్థులకు విమాన ప్రయాణం

టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి.. తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని...

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. 5 లక్షల బీమా, 2 లక్షల కొత్త ఫించన్లు, ఇంకా మరెన్నో.. రేవంత్ సర్కార్ జూన్ 2 బిగ్ ప్లాన్..!

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ప్రజలకు శుభవార్తలు చెప్పేందుకు...