Andhra Pradesh: రీ సర్వే మహిళా ప్రాణం తీసిందా! కర్నూలు జిల్లాలో ఉద్రిక్తత

Date:

కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలం భూ సర్వేకు సంబంధించి రెవెన్యూ అధికారుల తీరుపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తాజాగా మరణించింది. సర్వే విషయమే ఆమె ప్రాణం తీసింది.

కర్నూలు జిల్లా గోనెగండ్లలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. పొలం భూ సర్వేలో రెవెన్యూ అధికారుల ఏకపక్ష వైఖరి, అన్యాయంపై మనస్థాపం చెంది ఈరమ్మ (77) అనే వృద్ధురాలు ఐదు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ నిన్న తుదిశ్వాస విడిచింది. అధికారుల నిర్లక్ష్యం, అవతలి వ్యక్తులకు కొమ్ముకాయడం వల్లే తమకు అన్యాయం జరిగిందని, ఆ మనస్తాపంతోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు, రజక సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.

తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వృద్ధురాలి మృతదేహాన్ని సాయంత్రం కర్నూలు నుండి అంబులెన్స్ లో తీసుకువచ్చిన కుటుంబసభ్యులు నేరుగా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉంచి ధర్నా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆందోళనకారులు తహసీల్దార్ కార్యాలయం వైపు వెళ్లకుండా మార్గమధ్యలోనే అంబులెన్స్ ను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు కర్నూలు-ఎమ్మిగనూరు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపేందుకు యత్నించగా, పోలీసులు వారిని నిలువరించి మృతదేహాన్ని బలవంతంగా ఆమె నివాసానికి తరలించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎలాంటింఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసులను మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...