ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. ఇకపై మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కరిస్తే రూ.10వేలు ఇస్తామని ప్రకటించారు. విజయవాడలో ‘మధ్యవర్తిత్వం’ అంశంపై జరిగిన కార్యక్రమంలో ప్రకటన చేశారు. గతంలో రూ.3వేలు ఉండేదని దానిని రూ.10వేలకు పెంచుతామన్నారు. ఒకవేళ కేసు పరిష్కారం కాకపోయినా సరే రూ.3వేలు ఇస్తామన్నారు. ఏపీ హైకోర్టు సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ కూడా రిక్వెస్ట్ చేయడంతో నిర్ణయంజ

న్యాయవ్యవస్థకు సంబంధించి మధ్యవర్తిత్వ ఉద్యమం క్రమంగా బలపడుతోందని ఏపీ హైకోర్టు సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ అన్నారు. ఈ ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని.. ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖపట్నంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ సదస్సు నిర్వహణకు సహకారం అందించారని గుర్తు చేశారు. విజయవాడలో ‘మధ్యవర్తిత్వం’ అంశంపై రాష్ట్రస్థాయి చర్చ’ నిర్వహించిన సంగతి తెలిసిందే.సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరుకాగా, సీఎం చంద్రబాబు, హైకోర్టు సీజే కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజే మధ్యవర్తిత్వానికి సరైన ప్రోత్సహం లేదని చెప్పగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు కీలక ప్రకటన చేశారు.

ప్రస్తుతం మధ్యవర్తులకు మధ్యవర్తిత్వంతో కేసులు పరిష్కారమైతే ఒక్కో కేసుకు రూ.3 వేలు చెల్లిస్తున్నామన్నారు చంద్రబాబు. ఇకపై ఒక్కో కేసుకు దీన్ని రూ.10 వేలకు పెంచుతున్నామని ప్రకటించారు. ‘ఒకవేళ కేసులు పరిష్కారం కాకపోయినా సరే మధ్యవర్తిత్వం వహించిననందుకు రూ.3 వేలు మధ్యవర్తులకు చెల్లిస్తాం. మా నాన్న చదువుకోలేదు.. అయినా సరే నా చిన్నతనంలో మధ్యవర్తిత్వం ద్వారా అనేక వివాదాలు పరిష్కరించారు. ఆయనపై చుట్టుపక్కలుండే 20-30 గ్రామాల ప్రజలకు విశ్వాసం ఉండేది’ అన్నారు చంద్రబాబు. ఒకవేళ ప్రజలకు న్యాయం అందటంలో ఆలస్యం జరిగితే ఇబ్బందిపడతారు అన్నారు