రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కల్వకుంట్ల కవిత ట్వీట్

Date:

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తెలంగాణ నిరుద్యోగుల బాధలు పట్టించుకోరా అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు

వికారాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో ప్రసంగించేందుకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ .. ఇవాళ తెలంగాణకు వచ్చారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వికారాబాద్‌ జిల్లా అనంతగిరి హిల్స్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశంలో హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చిన వేళ.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత.. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై రాహుల్ గాంధీని కవిత నిలదీశారు

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

ఆలోచన చేయలేని ప్రభుత్వం, చర్చ చేయలేని ప్రతిపక్షం.. ప్రజలకు వరమా.. శాపమా?: విజయసాయిరెడ్డి

రాజమండ్రి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మెడికో ప్రియాంక కేసును సీబీఐతో విచారణ...

WTC ఫైనల్ రేసు.. ఏ జట్టుకు ఎన్ని విజయాలు కావాలంటే?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27 ఫైనల్ రేసు ఆసక్తికరంగా మారింది....

ఒక్కసారి నాటితే 12 ఏళ్లు దిగుబడి.. ఎకరాకు లక్షల్లో ఆదాయం.. సిరులు కురిపిస్తున్న “నన్నారి”

వాణిజ్య పంటల సాగుతో నష్టాలు ఎదుర్కొంటున్న రైతులు క్రమంగా వైవిధ్యభరితమైన పంటల...

282 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ (బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ), అస్సాం...