సనత్‌నగర్ టిమ్స్‌లో న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్ రాష్ట్రంలోనే తొలిసారిగా, సెకన్ల వ్యవధిలో రిపోర్టులు

Date:

తెలంగాణ ప్రభుత్వం సనత్‌నగర్‌ టిమ్స్ హాస్పిటల్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. 1000 పడకల సామర్థ్యంతో ఈ హాస్పిటల్ నిర్మిస్తుండగా.. ఉగాది నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక టిమ్స్‌లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. పేషెంట్లకు సత్వర వైద్యం అందించేందుకు న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్‌కు ఏర్పాటు చేస్తున్నారు. ఓ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఇటువంటి టెక్నాలజీ తీసుకురావటం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి

తెలంగాణలోని నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి పూర్తి ఉచితంగా అందించే లక్ష్యంతో హైదరాబాద్ సనత్‌నగర్‌లో ప్రభుత్వం తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) హాస్పిటల్ నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ హాస్పిటల్ ప్రారంభానికి ఇటీవల ముహుర్తం కూడా ఖరారు చేశారు. ఉగాది పండుగ రోజున అంటే మార్చి 19న ఈ ప్రతిష్టాత్మక 1000 పడకల ఆసుపత్రిని ప్రారంభించి ప్రజలకు అంకితం చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయింది

ఈలోగా సివిల్ పనులు, ఎక్విప్‌మెంట్ ట్రయల్స్ అన్నీ పూర్తి చేసి హాస్పిటల్‌ను వైద్య సేవలు అందించేందుకు సిద్ధం చేయాలని ఇప్పటికే ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇక టిమ్స్ హాస్పిటల్ అందుబాటులోకి వస్తే తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో ఒక సరికొత్త అధ్యాయం మొదలుకానుంది. టిమ్స్ ఆసుపత్రిలో అత్యాధునిక ‘న్యూమాటిక్ ట్యూబ్ సిస్టమ్’ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ తరహా సాంకేతికతను ప్రవేశపెట్టడం రాష్ట్రంలోనే ఇదే తొలిసారి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు..

వాయువ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ...

అమరావతికి ‘సిగ్నేచర్’ గేట్‌వే.. కృష్ణానదిపై అద్భుత నిర్మాణం.. దీని ప్రత్యేకతలు ఇవే.

ఏపీ రాజధాని అమరావతి రూపురేఖలను మార్చే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు కూటమి...

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ అభ్యర్థిగా తూమాటి మాధవరావు.. వైసీపీ అధినేత జగన్ నిర్ణయం

ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ పదవికి వైసీపీ అభ్యర్థిగా తూమాటి మాధవరావు...

ప్రపంచంలో యాడా లేని సరుకు మన ఏపీలోనే.. ఆ చేవ, దాని ధర వేరే లెవల్..

ప్రపంచంలోనే అరుదైన వృక్ష జాతుల్లో ఎర్రచందనం ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో,...