ఏపీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అంటిస్తారు. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు, ఇంటి నుంచే సేవలు

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తి పన్నుల చెల్లింపుల కోసం ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లే పని లేకుండా కీలక నిర్ణయం తీసుకుంది. చెత్త తొలగింపుపై వినతులు ఇచ్చేందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు. ఇంట్లోనే నుంచే ఈ పనులు పూర్తి చేయొచ్చు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు, అధికారుల్ని కలవాల్సిన పనిలేదు.

ప్రతి ఇంటి గోడకు, డోర్‌కు క్యూఆర్ కోడ్‌ను అంటిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ క్యూఆర్ కోడ్‌ సాయంతో స్కాన్‌ చేసి ఆస్తి పన్ను చెల్లింపులతో పాటుగా సమస్యలపైనా ఫిర్యాదులు చేయొచ్చు.. త్వరలో ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు మున్సిపల్, కార్పొరేషన్‌ల చుట్టూ తిరిగే పనిలేకుండా ప్రభుత్వం ఇస్మార్ట్ ఆలోచన చేసింది. ఇప్పటికే పురమిత్ర యాప్‌ ప్రజలకు అందుబాటులో ఉంది. ఆ యాప్ ద్వారా ప్రజలు తమ సమస్యల్ని ఫొటోలతో సహా అప్‌లోడ్‌ చేస్తే చాలు పరిష్కరిస్తారు.

ఈ యాప్‌కు ప్రజల నుంచి ఇప్పుడే ఆదరణ పెరుగుతోంది. తాజాగా ఆస్తిపన్ను సహా ఇతర సేవలు అందించేందుకు కొత్తగా క్యూఆర్ కోడ్‌ విధానాన్ని తీసుకొస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఈ క్యూఆర్ కోడ్‌లను మొత్తం 45 లక్షల ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, వ్యాపార సముదాయాలకు అతికించనున్నారు.

అంతేకాదు వారిని సంప్రదించేందుకు వీలుగా మొబైల్ నంబర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కేంద్రం దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సిటీ సర్వీస్‌ సెంటర్ల కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. అందుకే క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ప్రాజెక్టును ఏపీలో కూడా తీసుకొస్తున్నారు.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

UPI Payments: యూపీఐ వాడేవారికి షాకిచ్చే న్యూస్.. ఉచిత సేవలు బంద్..! ట్రాన్సాక్షన్ చేయాలంటే ఛార్జీలు కట్టాల్సిందే..

యూపీఐ లావాదేవీలు చేస్తున్నారా..? అయితే త్వరలో లావాదేవీలకు ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది....

ఏపీలో మళ్లీ కరోనా కలకలం.. పూణే ల్యాబ్‌కు శాంపిల్స్.. మొత్తం ఎన్ని కేసులు ఉన్నాయంటే..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ వెలుగుచూస్తుండటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. జూన్...

ఆరుగురిని చంపిన హంత‌కుడికి అనాథ‌లా అంత్య‌క్రియ‌లు.. కుటుంబ సభ్యులు వద్దనడంతో.. ఎవరు చేశారంటే?

తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఆరుగురుని అతికిరాతకంగా చంపిన కిరాతక...

సీఎం రేవంత్ రెడ్డికి రెండు నియోజకవర్గాల్లో ఓటు హక్కు.. ఏడాది జైలుశిక్ష పడే అవకాశం ఉందా?

రాష్ట్రంలో నిబంధనలను పటిష్టంగా అమలు చేయాల్సిన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా.....