D Educt: Oct 31: గ్రూప్‌-1 అభ్యర్థుల కోసం ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ విడుదల

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఇటీవల ప్రకటించిన 166 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు నవంబరు 9వ తేదీని ఆఖరి గడువుగా కమిషన్‌ నిర్ణయించింది.

2027 జనవరి 24న నిర్వహించనున్న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల ప్రిపరేషన్‌ను సులభతరం చేసేందుకు ప్రత్యేక స్టడీ మెటీరియల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ముఖ్యంగా జనరల్‌ ఆప్టిట్యూడ్‌లోని ‘శాస్త్ర, సాంకేతిక రంగాలు’ విభాగంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ అంశానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలు, సిలబస్‌ కవరేజ్‌, ప్రాక్టీస్‌ బిట్స్‌తో కూడిన సమాచారాన్ని సమగ్రంగా రూపొందించారు. ఈ మెటీరియల్‌ ద్వారా అభ్యర్థులు పరీక్షకు మరింత మెరుగ్గా సిద్ధమయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *